Share News

Viral: ఇన్ఫోసిస్‌లో 9 ఏళ్లు పనిచేసినా శాలరీ రూ.35 వేలు దాటలేదు.. టెకీ పోస్టు వైరల్

ABN , Publish Date - Jan 18 , 2025 | 06:17 PM

ఇన్ఫోసిస్‌లో తన ఉద్యోగ అనుభవం గురించి వివరిస్తూ ఓ మాజీ ఎంప్లాయీ పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. అక్కడ 9 ఏళ్లు పనిచేసినా తన నెల జీతం రూ.35 వేలే అని చెప్పుకొచ్చాడు. సంస్థ మారాక శాలరీ ఏకంగా నెలకు రూ.1.7 లక్షలకు చేరిందని అన్నారు.

Viral: ఇన్ఫోసిస్‌లో 9 ఏళ్లు పనిచేసినా శాలరీ రూ.35 వేలు దాటలేదు.. టెకీ పోస్టు వైరల్

ఇంటర్నెట్ డెస్క్: ఇన్ఫోసిస్‌లో 9 ఏళ్లు పనిచేసినా తన శాలరీ రూ.35వేలకే పరిమితమైందంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పెట్టిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చర్చ పతాకస్థాయిలో ఉన్న సమయంలో ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది. గతంలో ఇన్ఫో‌సిస్ నారాయణ మూర్తి ‘ వారానికి 70 పని గంటల’కు తోడు తాజాగా ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణియన్ చేసిన వారానికి ‘90 పని గంటల’ సూచనతో నెట్టింట మరోసారి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ టాపిక్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ రంగంలోని అనేక మంది తమ అనుభవాలను నెట్టింట పంచుకుంటున్నారు (Viral).

తాజా ఉదంతంలో సదరు వ్యక్తి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ పరిస్థితులు గురించి చెప్పుకొచ్చారు. తాను 2017లో ఇన్ఫోసిస్‌ను వీడానని చెప్పారు. అప్పటికి తొమ్మిదేళ్లుగా అక్కడ పనిచేస్తున్నా తన శాలరీ రూ.35వేలకే పరిమితమైందని అన్నారు.


Viral: 7 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడని క్యాబ్ డ్రైవర్‌పై ఉమ్మేసిన మహిళ.. షాకింగ్ వీడియో

‘‘నేను ఇన్ఫోసిస్‌ను వీడే సమయానికి నా నెలవారీ జీతం రూ.35 వేలు. ప్రస్తుతం నేను నెలకు రూ.1.7 లక్షలు సంపాదిస్తున్నా. అప్పటితో పోలిస్తే ఇప్పటి జీతం 400 రెట్లు ఎక్కువ’’ అని చెప్పుకొచ్చారు. ఇతర చోట్ల పోలిస్తే ఇన్ఫోసిస్‌లో శాలరీలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. కంపెనీ మారితే ఏకంగా 100 శాతం జీతం పెరుగుతుందని అన్నారు. ఇది చాలదన్నట్టు సంస్థ ట్రాన్స్‌పోర్టేషన్‌ వినియోగించుకునేందుకు రూ.3200, పార్కింగ్‌కు అదనపు చార్జీలు చెల్లించాల్సి వచ్చేదని అన్నారు. ప్రస్తుతం తాను పనిచేస్తున్న కంపెనీలో పళ్ల రసాలు రూ.20కే దొరుతుంటే.. ఇన్ఫోసిస్‌లో మాత్రం రూ.40 అని అన్నారు.


Uttarpradesh: ఫేక్ సర్టిఫికేట్లతో యూపీలో 9 ఏళ్ల పాటు ప్రభుత్వోద్యోగం చేసిన పాకిస్థానీ మహిళ! చివరకు..

ఇన్ఫోసిస్‌లో ఎదుగుదలకు అవకాశాలు కూడా తక్కువని వాపోయారు. ఉద్యోగులను కంపెనీ సబ్‌లెవెల్స్ స్థాయిలో ప్రమోషన్లు కల్పించేదని అన్నారు. శాలరీల్లో హైక్‌ లేకుండానే ప్రమోషన్లు ఇచ్చేదని అన్నారు. ప్రస్తుతం తానున్న సంస్థలో ఏటా 15 నుంచి 20 శాతం మేర శాలరీలు పెంచుతారని చెప్పుకొచ్చారు. మునుపటి సంస్థలో మాత్రం ఏటా 4 నుంచి 6 శాతం హైక్ మాత్రమే ఉండేదని వాపోయారు. ఇక సంస్థను వీడాలనుకున్న వారు ముందస్తుగా 90 రోజుల నోటీసు ఇవ్వాలన్న రూల్ కూడా ఉద్యోగులపై భారం మోపేదని చెప్పుకొచ్చారు. ఈ నిబంధన కారణంగా కొత్త సంస్థలోకి మారడం కష్టతరం అయ్యేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను పనిచేస్తున్న సంస్థలో రెండు నెలల ముందు నోటీసు ఇస్తే సరిపోతుందని అన్నారు. ఆఫీసుకొచ్చి కచ్చితంగా ఇన్ని గంటలు పనిచేయాలన్న నియమం ఉద్యోగులను మరింత చికాకు పరిచేదాని, కొందరు ఈ నిర్దిష్ట గడువును పూర్తిచేసేందుకు వారాంతాల్లో ఆఫీసుకొచ్చి కొన్ని గంటలు ఉండి వేళ్లే వారని అన్నారు. ఇలా ఇన్ఫోసిస్‌‌పై ఘాటు విమర్శలు కురిపించిన అతడి పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Jan 18 , 2025 | 06:23 PM