Viral: 7 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడని క్యాబ్ డ్రైవర్‌పై ఉమ్మేసిన మహిళ.. షాకింగ్ వీడియో
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:42 PM
7 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన క్యాబ్ డ్రైవర్‌ను ఓ మహిళా కస్టమర్ నానా ఇబ్బందులు పెట్టింది. అతడిపై నోరు పారేసుకోవడమే కాకుండా ముఖంపై ఉమ్మేసి మరీ కారు దిగి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ట్రాఫిక్ అన్నాక రద్దీ.. ఆలస్యంగా గమస్యస్థానాలకు చేరుకోవడం సహజం. ఇది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా క్యాబ్‌లు, లేదా బైక్స్‌ను యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పుడు కాస్త లేటవ్వొచ్చు. కానీ ఇలా లేటైతే కొందరు కస్టమర్లు సహించరు. పైపెచ్చు డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ఓ మహిళ మాత్రం లేటుగా వచ్చిన క్యాబ్ డ్రైవర్‌పై పద్ధతి మరిచి ప్రవర్తించింది. అనకూడని మాటలు చేయకూడని పలు చేసి అతడిని దారుణంగా అవమానించింది. ఇందుకు సంబంధిచిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతూ జనాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. సాటి మనిషితో అంత నీచంగా ప్రవర్తించిన మహిళ మళ్లీ క్యాబ్ ఎక్కకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు (Viral).
Uttarpradesh: ఫేక్ సర్టిఫికేట్లతో యూపీలో 9 ఏళ్ల పాటు ప్రభుత్వోద్యోగం చేసిన పాకిస్థానీ మహిళ! చివరకు..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, క్యాబ్ డ్రైవర్ కేవలం 7 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. దీంతో, అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారెక్కిన మహిళ ఆ తరువాత అతడికి చుక్కలు చూపించింది. పెద్ద పెద్దగా అరుస్తూ అవమానకరంగా మాట్లాడుతూ నానా యాగీ చేసింది. తప్పంతా డ్రైవర్‌తే అంటూ నోరుపారేసుకుంది. అతడు ఎంతగా నచ్చజెబుతున్నా వినకుండా రెచ్చిపోయింది. ఓ మనిషిగా అతడికి ఇవ్వాల్సి విలువ కూడా ఇవ్వకుండా దారుణంగా ప్రవర్తించింది.
Viral: చైనాలో ఇలాక్కూడా జరుగుతుందా? ఉద్యోగి లాటరీ గెలిచాడని తెలిసిన సంస్థ యాజమాన్యం..
మహిళ ఇంతగా రచ్చ చేస్తున్నారు. డ్రైవర్ మాత్రం తన హుందాతనం కోల్పోలేదు. తన పరిధి దాటలేదు. మహిళతో గౌరవంగానే మాట్లాడాడు. ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. ఆమె ఎంతకీ వెనక్కు తగ్గకపోవడంతో చివరకు కారు దిగమని ఖరాఖండీగా చెప్పేశాడు. దీంతో, షాక్ తిన్న ఆమె మళ్లీ యథాప్రకారం అతడితో వాదన కొనసాగించే ప్రయత్నం చేసింది. కానీ డ్రైవర్ మాత్రం ఆమె కారు దిగిపోవాల్సిందేనని పట్టుబట్టడంతో చివరకు అతడిపై ఉమ్మేసి కారు దిగిపోయింది.
Viral: చైనాలో నిరుద్యోగుల కష్టాలు.. ఖాళీగా ఉన్నామని తెలిస్తే పరువు పోతుందని..
ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో జనాలు సదరు మహిళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్‌లో వస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో లేటు కావడం సహజమే కదా అని అన్నారు. సాటి మనిషితో ఇలాగేనా ప్రవర్తించేదని ప్రశ్నించారు. ఆమె మరోమారు క్యాబ్ వాడకుండా జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇక క్యాబ్ డ్రైవర్‌పై కూడా అనేక మంది ప్రశంసలు కురిపించారు. అతడు సంస్కారశీలి అని, హుందాతనం ఉన్నవాడని వేనోళ్ల పొగిడారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.