Share News

Viral: చైనాలో ఇలాక్కూడా జరుగుతుందా? ఉద్యోగి లాటరీ గెలిచాడని తెలిసిన సంస్థ యాజమాన్యం..

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:12 PM

తన ఉద్యోగులకు స్వయంగా లాటరీ టిక్కెట్లు పంచిన ఓ కంపెనీ లాటరీ తగిలిన ఉద్యోగి నుంచి డబ్బు వసూలు చేసే ప్రయత్నం చేసింది. చైనాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Viral: చైనాలో ఇలాక్కూడా జరుగుతుందా? ఉద్యోగి లాటరీ గెలిచాడని తెలిసిన సంస్థ యాజమాన్యం..

ఇంటర్నెట్ డెస్క్: లాటరీ గెలిచిన వాళ్లు ఎవరైనా ఆ డబ్బును తమ అవసరాల కోసమో లేదా కుటుంబ అవసరాలకో ఖర్చు పెడతారు. కానీ చైనాలోని ఓ సంస్థ మాత్రం లాటరీ గెలిచిన ఉద్యోగికి భారీ షాకిచ్చింది. లాటరీ డబ్బు మొత్తం తమకిస్తే ఉద్యోగులందరికీ పంచుతామంటూ మెలిక పెట్టింది. ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది (Viral).

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఓ కంపెనీ తమ ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు పార్టీ ఏర్పాటు చేసింది. ఉద్యోగులను ఆహ్వానించింది. అంతేకాకుండా, ఉద్యోగులందరికీ తమ సొంత డబ్బుతో లాటరీ టిక్కెట్లు కొని పంచింది. పైసా ఖర్చు లేకుండా లాటరీ టిక్కెట్లు వచ్చినందుకు అంతా సంబరపడ్డారు. తమలో ఒకరికైనా లాటరీ దక్కకపోతుందా అన్న ఆశతో కొన్ని రోజులు గడిపారు. చివరకు వారు అనుకున్నదే నిజమైంది.


Viral: చైనాలో నిరుద్యోగుల కష్టాలు.. ఖాళీగా ఉన్నామని తెలిస్తే పరువు పోతుందని..

సంస్థలోని ఓ వ్యక్తి అనూహ్యంగా లాటరీ తగిలింది. అతడు ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఏకంగా రూ.7 కోట్లు గెలుచుకున్నందుకు సంతోషించాడు. ఇక లైఫంతా హ్యాపీగా గడపొచ్చనుకున్నాడు. కానీ ఊహించని విధంతా సీన్ రివర్స్ అయ్యింది. తాము లాటరీ టిక్కెట్లు కొనిచ్చాము కాబట్టి డబ్బును తిరిగివ్వాలని ఉద్యోగిని కోరింది. లాటరీ డబ్బును ఉద్యోగులందరికీ సమానంగా పంచుతామని చెప్పింది.

ఈ ప్రతిపాదన విని ఉద్యోగి మొదట షాకయ్యాడు. ఆ తరువాత తేరుకుని కంపెనీ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాడు. లాటరీ డబ్బులు ఇచ్చేదే లేదన్నాడు. చివరకు విషయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇది సివిల్ వివాదమని తేల్చి చెప్పిన పోలీసులు తాము చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. దీంతో, ఇరు వర్గాలు కోర్టును ఆశ్రయించాయి.


Uttarpradesh: ఫేక్ సర్టిఫికేట్లతో యూపీలో 9 ఏళ్ల పాటు ప్రభుత్వోద్యోగం చేసిన పాకిస్థానీ మహిళ! చివరకు..

ఇదిలా ఉంటే.. ఈ ఘటనకు సంబంధించి వెలుగులోకొచ్చిన మరో షాకింగ్ స్థానికంగా పెను కలకలానికి దారితీసింది. లాటరీ ఏ టిక్కెట్‌కు దక్కిందో సదరు సంస్థకు ముందే తెలుసని స్థానిక మీడియాలో ఓ షాకింగ్ కథనం వెలుగులోకి వచ్చింది. అయితే, లాటరీ వచ్చిన టిక్కెట్ కాకుండా మిగతావి ఉద్యోగులకు పంచాలని పైఅధికారులు సిబ్బందిని ఆదేశించారు. కానీ ఎక్కడో జరిగిన పొరాపటు కారణంగా బంపర్ ఆఫర్ ఉన్న లాటరీ టిక్కెట్టే ఉద్యోగి చేతికి చేరింది. చివరకు పరిస్థితి ఊహించని మలుపు తిరిగింది.

Viral: తృణమూల్ ఎంపీకి పాడైపోయిన ఐస్ క్రీమ్ డెలివరీ!

Viral: అత్త త్వరగా చనిపోవాలంటూ నోటుపై రాసి.. గుడి హుండీలో వేసి..

Read Latest and Viral News

Updated Date - Jan 17 , 2025 | 11:12 PM