Share News

Viral: చైనాలో నిరుద్యోగుల కష్టాలు.. ఖాళీగా ఉన్నామని తెలిస్తే పరువు పోతుందని..

ABN , Publish Date - Jan 17 , 2025 | 10:46 PM

తమకు జాబ్ పోయినట్టు తెలిస్తే నలుగురిలో పరువుపోతుందని భావిస్తున్న చైనా యువత ఖాళీగా ఉన్న ఆఫీసుల్లో రోజంతా గడిపి వస్తూ పనిచేస్తున్నట్టు ఇంట్లో వాళ్లకు బిల్డప్ ఇస్తున్నారు. చైనాలో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుండటంతో యువత చివరకు ఇలాంటి ట్రిక్స్‌కు దిగుతున్నారు.

Viral: చైనాలో నిరుద్యోగుల కష్టాలు.. ఖాళీగా ఉన్నామని తెలిస్తే పరువు పోతుందని..

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు ఉద్యోగమంటూ పురుష లక్షణంగా ఉండేది కానీ నేటి జమానాలో అందరూ కెరీర్‌పై దృష్టిపెడుతున్నారు. అయితే, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడిపోతాయో తెలీని ఉద్యోగాల కారణంగా అనేక మంది సతమతమవుతున్నారు. చివరకు ఉద్యోగం పోయాక పరువు కాపాడుకునేందుకు జాబ్ చేస్తున్నట్టు నటించడం మొదలుపెడుతున్నారు. ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ తీరు చైనాలో ఎక్కువ కనిపిస్తోంది (Viral).

చైనాలో అనేక భారీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ లేఆఫ్‌ల ప్రభావం యువతపై ఎక్కువగా ఉంది. ఉద్యోగం లేకపోతే సమాజంలో పరువు పోతుందని, తల్లిదండ్రులు దుఃఖిస్తారని అనేక మంది యువతీయువకులు బెంగపడుతున్నారు. ఇలాంటి వారిని ఆసరాగా నిలవడంలో కొందరి వ్యాపార అవకాశం కూడా కనిపించింది.


Uttarpradesh: ఫేక్ సర్టిఫికేట్లతో యూపీలో 9 ఏళ్ల పాటు ప్రభుత్వోద్యోగం చేసిన పాకిస్థానీ మహిళ! చివరకు..

రోజుకు కేవలం 150 చెల్లిస్తే నిరుద్యోగులను తన ఆఫీసుకు వచ్చి రోజంతా కూర్చుని వెళ్లేందుకు అనుమతిస్తానని ఓ వ్యక్తి పేపర్లలో యాడ్ ఇచ్చాడు. ఇంట్లో వాళ్లకు ఆఫీసుకు వెళుతున్నట్టు చెప్పి ఇక్కడకు వచ్చి కాస్త సేదతీరొచ్చని నిరుద్యోగులు భావించడంతో అతడి యాడ్‌కు భారీగా స్పందన వచ్చింది. తన ఆఫీసులోని రివాల్వింగ్ చెయిర్‌లో కూర్చుని బాస్‌లా పోజులిచ్చేందుకు నిరుద్యోగులకు అవకాశమిస్తానని మరో వ్యక్తి యాడ్ ఇవ్వగా గొప్ప స్పందన వచ్చింది.


Viral: కుంభమేళాలో మోనాలిసా.. చూపు తిప్పుకోలేని అందం అంటే ఇదే!

ఈ ట్రెండ్‌పై కొందరు విమర్శలు ఎక్కుపెట్టారు. నిరుద్యోగులు తమ బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు ఇదో అవకాశమని దుయ్యబట్టారు. ఉద్యోగాల కోసం వెతుక్కోకుండా యువత ఇలాంటి చోట్ల రోజంతా వ్యర్థంగా గడిపే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మరికొందరు మాత్రం దీన్ని సమర్థించారు. అసలే జాబ్‌‌లేక అవస్థ పడుతున్న యువత తమ కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే ఇలాంటి పనులు చేస్తున్నారని కొందరు అన్నారు. ఇలా నిరుద్యోగులు ఒక చోట చేరి పరస్పరం అండగా నిలుస్తారని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం చైనాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Viral: తృణమూల్ ఎంపీకి పాడైపోయిన ఐస్ క్రీమ్ డెలివరీ!

Viral: అత్త త్వరగా చనిపోవాలంటూ నోటుపై రాసి.. గుడి హుండీలో వేసి..

Read Latest and Viral News

Updated Date - Jan 17 , 2025 | 11:13 PM