Share News

Uttarpradesh: ఫేక్ సర్టిఫికేట్లతో యూపీలో 9 ఏళ్ల పాటు ప్రభుత్వోద్యోగం చేసిన పాకిస్థానీ మహిళ! చివరకు..

ABN , Publish Date - Jan 17 , 2025 | 10:27 PM

నకిలీ నివాస ధ్రువీకరణ పత్రంతో ఓ మహిళ యూపీలో ఏకంగా 9 ఏళ్ల పాటు ప్రభుత్వ టీచర్‌గా పనిచేసింది. అధికారులకు ఇటీవల ఆమె గురించి సమాచారం అందడంతో చివరకు నిందితురాలి బండారం బయటపడిండి.

Uttarpradesh: ఫేక్ సర్టిఫికేట్లతో యూపీలో 9 ఏళ్ల పాటు ప్రభుత్వోద్యోగం చేసిన పాకిస్థానీ మహిళ! చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: నకిలీ సర్టిఫికేట్‌లతో ఓ పాకిస్థానీ మహిళ దాదాపు 9 ఏళ్లుగా ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం చేస్తున్న ఘటన యూపీలోని బరేలీలో తాజాగా వెలుగు చూసింది. అసలు ఆమె ప్రభుత్వం ఉద్యోగం ఎలా సంపాదించిందన్న దానిపై ప్రస్తుతం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిందితురాలి గురించి ఫిర్యాదు అందడంతో దర్యాప్తు జరిగిన అధికారులు అసలు విషయం తెలిసి షాకైపోయారు. చివరకు నిందితురాలిని విధుల నుంచి తొలగించి కేసు నమోదు చేశారు (Viral).

షుమైలా ఖాన్ అనే మహిళ 2015, నవంబర్ 6న ప్రభుత్వ టీచర్‌గా నియమితురాలైంది. రామ్‌పూర్‌లోని నకిలీ నివాస ధృవీకరణ పత్రం పొందిన ఆమె ఆ తరువాత ఫతేగంజ్ వెస్ట్‌లోని మాధోపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగంలో చేరింది. అది మొదలు నెల నెల క్రమం తప్పకుండా ఆమె ఖాతాలో శాలరీ కూడా చేరింది.


Civil Lines: దాదాపు అన్ని భారతీయ నగరాల్లో కనిపించే సివిల్ లైన్స్ గురించి తెలుసా?

అయితే, ఇటీవల జిల్లా మెజిస్ట్రేట్‌కు ఆమెపై ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరపి చివరకు ఆమె రెసిడెన్స్ సర్టిఫికేట్‌ను రద్దు చేశారు. చివరకు విద్యాశాఖ ఆమెను విధుల నుంచి డిస్మిస్ చేసింది. ఆమెపై కేసు కూడా నమోదైంది.

పాకిస్థాన్‌కు చెందిన షుమైలా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని జాబ్ పొందినట్టు దర్యాప్తులో తేలింది. అక్కడే ఆమె దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు కొనసాగింది. అప్పట్లో పలుమార్లు ఆమె డాక్యుమెంట్ల పరిశీలన జరిగినా అధికారులు జాగ్రత్త పడటంతో విషయం బయటకుపొక్కలేదు.


Viral: కుంభమేళాలో మోనాలిసా.. చూపు తిప్పుకోలేని అందం అంటే ఇదే!

అయితే, షుమైలా బండారం బయటపెడుతూ అధికారులకు ఓ సీక్రెట్ ఫిర్యాదు అందడంతో అంతా అప్రమత్తమయ్యారు. వెంటనే ఆమెను డిస్మిస్ చేశారు. మరోవైపు పరారీలో ఉన్న మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు మహిళకు నకిలీ నివాస ధృవీకరణ పత్రం ఎలా అందిందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక ఆమెకు బదిలీ అయిన సొమ్మును రికవరీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తోంది.

Viral: పసిబిడ్డతో విమాన ప్రయాణం! టేకాఫ్‌లో జాప్యం జరగడంతో..

Viral: అత్త త్వరగా చనిపోవాలంటూ నోటుపై రాసి.. గుడి హుండీలో వేసి..

Read Latest and Viral News

Updated Date - Jan 17 , 2025 | 11:14 PM