Share News

Viral: భారత పర్యటనకు వచ్చిన బ్రిటీషర్! అరటి పళ్లు కొందామని వెళితే భారీ షాక్

ABN , Publish Date - Jan 18 , 2025 | 07:41 PM

భారత పర్యటనకు వచ్చిన ఓ బ్రిటీష్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక్క అరటి పండు ధర రూ.100 అని వ్యాపారి చెప్పడంతో షాకైపోయాడు. అతడు నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Viral: భారత పర్యటనకు వచ్చిన బ్రిటీషర్! అరటి పళ్లు కొందామని వెళితే భారీ షాక్

ఇంటర్నెట్ డెస్క్: కొన్ని వందల శతాబ్దాలుగా ఉనికిలో ఉన్న భారతీయ సంస్కృతి పట్ల విదేశీయులెందరో ఆకర్షితులవుతుంటారు. కొందరికి అవకాశం చిక్కగానే భారత్‌కు వచ్చేస్తుంటారు. అయితే, ఇక్కడ పర్యటించే అనేక మందికి కొందరు వ్యాపారుల తీరు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. ఇందుకు సంబంధించి తాజా ఉదాహరణగా ఓ బ్రిటీషర్ నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అరటి పండు కొనుగోలు చేద్దామనుకున్న అతడు ఒక్క అరటి పండు ధర రూ.100 తెలిసి షాకైపోయాడు(Viral).

హ్యూ అనే బ్రిటీష్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇటీవల భారత పర్యటన సందర్భంగా తన అనుభవాలను వీడియోలో చిత్రీకరించారు. ఈ క్రమంలో ఓసారి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న అతడికి అరటి పళ్ల బండి కనిపించింది. వెంటనే పండ్లను కొందామని డిసైడైన అతడు వ్యాపారిని పలిచి ధర ఎంత అని అడిగాడు. అతడేమో రూ.100 అని చెప్పడంతో హ్యూ షాకైపోయాడు. మరోసారి వ్యాపారిని రెట్టించి అడగ్గా పాత రేటునే పునరుద్ఘాటించాడు. ఒక్క అరటికి అంత ఇవ్వనని స్పష్టం చేశాడు. ఇలాగైతే మంచి బేరాన్ని పోగొట్టుకుంటావని అన్నాడు. కానీ, వ్యాపారి ధర తగ్గించేది లేదని చెప్పడంతో హ్యూ తన దారిన తను వెళ్లిపోయాడు.


Viral: ఇన్ఫోసిస్‌లో 9 ఏళ్లు పనిచేసినా శాలరీ రూ.35 వేలు దాటలేదు.. టెకీ పోస్టు వైరల్

ఆ తరువాత ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్న హ్యూ ఒక్క అరటి పండు ధర రూ.100 అంటే నమ్మలేకపోతున్నానని అన్నాడు. ఇంత రేటు బ్రిటన్‌లో కూడా ఉండదని చెప్పుకొచ్చారు. ఈ రేటుకు అక్కడ ఏకంగా 8 పండ్లు వస్తాయని అన్నాడు. ఇకడ ఫారినర్లు ఇలాగే డబ్బులు చెల్లించాలేమో అని సరదా కామెంట్ చేశారు

కాగా, ఈ వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కొందరు అతడి పరిస్థితికి విచారం వ్యక్తం చేశారు. అరటి పండ్ల వ్యాపారి తరపున తాము క్షమాపణలు చెబుతున్నామని కొందరు అన్నారు. మరికొందరేమో సెటైర్లు పేల్చారు. అది విదేశస్తులపై వేసే సర్వీస్ ట్యా్క్స్ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాపారులు కొందరుంటే చాలు దేశ ఆర్థిక స్థితి బాగుపడిపోతుందని చెప్పారు.


Viral: 7 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడని క్యాబ్ డ్రైవర్‌పై ఉమ్మేసిన మహిళ.. షాకింగ్ వీడియో

అరటి పళ్ల వ్యాపారిని ఆ బ్రిటీషర్ తప్పుగా అర్థం చేసుకున్నాడని కొందరు అభిప్రాయపడ్డారు. అరటి పండ్ల గెల మొత్తం అడిగి ఉండొచ్చని భావించి అంత ధర చెప్పి ఉండొచ్చని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఇంగ్లీష్ రావాలన్న రూలేమీ లేదని వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Jan 18 , 2025 | 07:41 PM