Police Helicopter: మాక్ డ్రిల్.. నదిలో కుప్పకూలిన పోలీస్ హెలికాఫ్టర్
ABN, Publish Date - Jul 11 , 2025 | 10:20 AM
Police Helicopter: ఇద్దరి పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా మారింది. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది. వారు సుల్తానా అమీనా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
మాక్ డ్రిల్ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. ఓ పోలీస్ హెలికాఫ్టర్ సాంకేతిక లోపం కారణంగా ప్రమాదానికి గురైంది. నదిలో కుప్పకూలింది. ఈ ప్రమాదం కారణంగా ఇద్దరు పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాదం మలేషియాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐదుగురు పోలీసులు ‘మల్టీలేటరల్ న్యూక్లియర్ సెక్యూరిటీ డిటెక్షన్ ఎక్సర్‌సైజ్’లో భాగంగా హెలికాఫ్టర్‌తో మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు.
గురువారం ఉదయం మలేషియన్ మేరీటైమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ దగ్గరలో హెలికాఫ్టర్ గాల్లో ఎగురుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఉన్నట్టుండి నదిలో కుప్పకూలింది. హెలికాఫ్టర్లో ఉన్న ఐదుగురు పోలీసులు నదిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. నీటిలో మునిగిపోయిన వారిని బయటకు తీశాయి. హుటాహుటిన ఆస్పత్రి తరలించాయి. ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు.
కానీ, ఇద్దరి పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా మారింది. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది. వారు సుల్తానా అమీనా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ‘ది సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ మలేషియా పోలీస్ హెలికాఫ్టర్ ప్రమాదాన్ని ధ్రువీకరించింది. AS355N హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు వెల్లడించింది. ఆ హెలికాఫ్టర్ తంగ్‌జంగ్ కుపంగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఉదయం 9.51 నిమిషాలకు బయలు దేరిందని, కొన్ని నిమిషాలకే ప్రమాదానికి గురైందని తెలిపింది. ఇక, ఈ సంఘటనపై ‘ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది.
ఇవి కూడా చదవండి
గుడ్ న్యూస్.. జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా.. యువతకు ఆంధ్రజ్యోతి ఆహ్వానం
అలాంటి ఫొటోలు తీయకండి.. పాపరాజీలపై హీరోయిన్ ఆగ్రహం..
Updated Date - Jul 11 , 2025 | 10:27 AM