ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Khaleja Re Release: ఖలేజా రీరిలీజ్.. పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే..

ABN, Publish Date - May 30 , 2025 | 09:41 PM

Khaleja Re Release: ఈ నేపథ్యంలోనే పిచ్చికి పరాకాష్టగా నిలిచే సంఘటన ఒకటి జరిగింది. ఓ ఫ్యాన్ పాముతో థియేటర్‌లో హల్‌చల్ చేశాడు. ఖలేజ సినిమాలో హీరో మహేష్ బాబు పామును విలన్ల మీదకు విసురుతాడు.

Khaleja Re Release

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఫెయిల్ అయిన సినిమాలు కూడా రీరిలీజ్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయితే, ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. తాజాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా రీరిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూకట్టారు. థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు. సాధారణంగా సినిమాలో హీరో గెటప్‌తో ఫ్యాన్స్ థియేటర్లకు వెళుతుంటారు. కానీ, ఖలేజాకు మాత్రం.. సినిమాలో ఉపయోగించిన వస్తువులతో ఫ్యాన్స్ థియేటర్లకు వెళ్లారు.


ఈ నేపథ్యంలోనే పిచ్చికి పరాకాష్టగా నిలిచే సంఘటన ఒకటి జరిగింది. ఓ ఫ్యాన్ పాముతో థియేటర్‌లో హల్‌చల్ చేశాడు. ఖలేజ సినిమాలో హీరో మహేష్ బాబు పామును విలన్ల మీదకు విసురుతాడు. అందుకే ఓ ఫ్యాన్ మహేష్ బాబు లాగా డ్రెస్ ధరించి.. పాము పట్టుకుని థియేటర్‌లోకి వచ్చాడు. దాన్ని అందరికీ చూపుతూ నానా హంగామా చేశాడు. విజయవాడలోని ఓ సినిమా థియేటర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

యువకుడితో ప్రేమ.. చెల్లెలికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవటంతో..

స్టేజిపై ప్రధాని మోదీ పేరు మర్చిపోయిన సీఎం.. ఏమన్నాడంటే..

Updated Date - May 30 , 2025 | 09:41 PM