Share News

CM Nitish Kumar: స్టేజిపై ప్రధాని మోదీ పేరు మర్చిపోయిన సీఎం.. ఏమన్నాడంటే..

ABN , Publish Date - May 30 , 2025 | 08:37 PM

Bihar CM Nitish Kumar: ‘అందరూ ఓ సారి పైకి లేచి ఆయనకు అభినందనలు తెలియజేయండి’ అంటూ సభకు వచ్చిన జనాల్ని పైకి లేపి మరీ ప్రధానికి అభినందనలు చెప్పించారు. ఎక్కువ సేపు మాట్లాడకుండానే ముఖ్యమంత్రి నితీష్ తన ప్రసంగాన్ని ముగించారు.

CM Nitish Kumar: స్టేజిపై ప్రధాని మోదీ పేరు మర్చిపోయిన సీఎం.. ఏమన్నాడంటే..
Bihar CM Nitish Kumar

భారత ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది. ఎక్కడైనా కలిస్తే ఎంతో ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. అలాంటి ప్రధాని మోదీ పేరును ముఖ్యమంత్రి నితీష్ మరిచిపోయారు. అది కూడా ఓ స్టేజిపై.. మోదీ పక్కనే ఉండగా ఆయన పేరుకు బదులు వేరే నాయకుడి పేరు చెప్పారు. తన పొరపాటును గ్రహించి నితీష్ వెంటనే నవ్వేశారు. ఆ వెంటనే పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. దీంతో సభా ప్రాంగణం మొత్తం అరుపులతో హోరెత్తింది.


ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న బీహార్‌లో పర్యటించారు. బీహార్‌లోని కరకట్‌లో 48,520 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఇదే సభలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని మోదీని ఉద్దేశించి స్టేజిపై మాట్లాడారు. అయితే, నితీష్ తన ప్రసంగానికి ముందు మోదీ పేరును మర్చిపోయారు. స్టేజిపై ఆయన మాట్లాడుతూ.. ‘ ఈ అభివృద్ధి పనుల్ని గౌరవనీయులైన అటల్ బిహారీ వాజ్‌పేయి... సారీ నరేంద్ర మోదీ ..


అటల్ బిహారీ వాజ్‌పేయి అంతకు ముందు అభివృద్ధి చేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మీ కోసం ఇన్ని పనులు చేస్తున్నారు. అందరూ ఓ సారి పైకి లేచి ఆయనకు అభినందనలు తెలియజేయండి’ అంటూ సభకు వచ్చిన జనాల్ని పైకి లేపి మరీ ప్రధానికి అభినందనలు చెప్పించారు. ఎక్కువ సేపు మాట్లాడకుండానే ముఖ్యమంత్రి నితీష్ తన ప్రసంగాన్ని ముగించారు. ఇక, ఇదే స్టేజిపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో బీఎస్ఎఫ్ శౌర్యం, ధైర్యాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. మే 10న సరిహద్దులో బీహార్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఇంతియాజ్ ప్రాణాలను అర్పించారని పేర్కొన్నారు. ఇంతియాజ్‌కు నివాళులు అర్పించారు.


ఇవి కూడా చదవండి

96 సీక్వెల్‌.. క్యారెక్టర్లపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

థాయ్‌లాండ్ వెళ్లేవారికి హెచ్చరిక.. పులులతో జాగ్రత్తగా ఉండండి..

Updated Date - May 30 , 2025 | 08:37 PM