Maha Kumbh Mela: కుంభమేళాలో అరుదైన ఘటన.. 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి.. అకస్మాత్తుగా అఘోరిగా..
ABN, Publish Date - Jan 30 , 2025 | 09:11 AM
మహాకుంభమేళాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ వ్యక్తి సడన్‌గా అఘోరిగా దర్శనమిచ్చాడు. అతన్ని గుర్తించి.. అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులు చివరకు షాక్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే..
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి జనం తరలిపోతున్నారు. దీంతో మహాకుంభమేళాలో ఇసుక వేస్తే రాలనంతగా జనం కనిపిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో పిల్లలు, చదువురాని వారు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు కూడా మైకుల ద్వారా పదే పదే హెచ్చరికలు చేస్తుంటారు. అయితే ఇదే మహాకుంభమేళాలో ఓ కుటుంబానికి విచిత్ర అనుభవం ఎదురైంది. 27 ఏళ్ల తప్పిపోయిన వ్యక్తి.. అకస్మాత్తుగా అఘోరిగా దర్శమనిచ్చాడు. అతన్ని గుర్తించిన భార్య.. తన కుటుంబంతో సహా అక్కడికి వెళ్లింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
జార్ఖండ్‌కు (Jharkhand) చెందిన గంగాసాగర్ యాదవ్ అనే వ్యక్తికి భార్య ధన్వాదేవి, కుమారులు మలేష్, విమలేష్ ఉన్నారు. అయితే 1998లో గంగాసాగర్ ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. భర్త సడన్‌గా కనిపించకపోయే సరికి కంగారుపడిన భార్య.. తెలిసిన వారి వద్ద విచారించింది. అలాగే గంగాసాగర్ తల్లిదండ్రులు కూడా వివిధ ప్రాంతాల్లో వెతికారు. అయినా అతను కనిపించలేదు. కొన్ని నెలల అన్వేషణ తర్వాత.. గంగాసాగర్‌పై ఆశలు వదులుకున్న భార్య.. తన పిల్లలను కష్టపడి పెంచి పెద్ద చేసింది.
ఇదిలా ఉండగా 27 తర్వాత తాజాగా.. మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) హాజరైన ధన్వాదేవి బంధువులు.. అక్కడి ఓ సాధువును చూసి షాక్ అయ్యారు. అచ్చం గంగాసాగర్‌లా ఉండడంతో ఫొటో తీసి, తన భార్యకు పంపించారు. ఫొటో చూడగానే భర్తను గుర్తించిన ధన్వాదేవి.. తన పిల్లలు, కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకుంది. నుదిటి పై మచ్చ, ఎత్తు పళ్లు, మోకాలిపై దెబ్బలు చూసి తన భర్తను గుర్తించిన ధన్వాదేవి.. తమతో పాటూ ఇంటికి రావాలని వేడుకుంది. అయితే వారిని చూసిన అఘోరి విచిత్రంగా ప్రవర్తించాడు. ‘‘మీరెవరో నాకు తెలీదు.. నా పేరు గంగాసాగర్ కాదు.. బాబా రాజ్‌కుమార్ సాధువు’’.. అని సమాధానం ఇచ్చాడు.
గంగాసాగర్ యాదవ్ సోదరుడు మురళి కూడా తన తమ్ముడిని గుర్తించాడు. అయినా ఆ అఘోరి మాత్రం అందుకు అంగీకరించలేదు. దీంతో చివరకు సదరు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కుంభమేళా ముగిసే వరకూ ఇక్కడే ఉంటామని, తమ భర్తకు అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తామని వారు చెబుతున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral Video: ప్రేయసి మాట్లాడుతుంటే ప్రపంచాన్నే మర్చిపోయాడు.. అంతలోనే దూసుకొచ్చిన రైలు.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 30 , 2025 | 09:31 AM