Jaya Bachchan Snaps: అభిమానిని తోసేసిన జయా బచ్చన్.. దెబ్బకు జడుసుకున్నాడు..
ABN, Publish Date - Aug 13 , 2025 | 11:56 AM
Jaya Bachchan Snaps: సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌కు వెళ్లారు. ఆమె బయట నిల్చుని తెలిసిన వాళ్లతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో ఓ అభిమాని ఆమె దగ్గరకు వచ్చాడు.
జనాలు తమ అభిమాన నటీ,నటులతో సెల్ఫీలు దిగాలనుకోవటం సర్వసాధారణమైన విషయం. సినిమా వాళ్లు కనిపించగానే సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. ఇదే కొన్ని సార్లు అభిమానులను అవమానాల పాలు చేస్తూ ఉంటుంది. ఇందుకు జయా బచ్చన్ సంఘటనే ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. అది గమనించిన జయా బచ్చన్ అతడ్ని తోసేసింది. ఆ అభిమానిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం సైతం వ్యక్తం చేసింది.
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌కు వెళ్లారు. ఆమె బయట నిల్చుని తెలిసిన వాళ్లతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో ఓ అభిమాని ఆమె దగ్గరకు వచ్చాడు. సెల్ ఫోన్ తీసి సెల్ఫీ తీసుకోవటం మొదలెట్టాడు. ఆమెకు చాలా దగ్గరగా వెళ్లాడు. ఇది గమనించిన జయా బచ్చన్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ఆమె ఠక్కున పక్కకు జరిగారు. అతడ్ని చేత్తో దూరంగా తోసేశారు. ‘మీరేంచేస్తున్నారు? ఏంటిది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జయా బచ్చన్ అంత సీరియస్ అవటంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు. సారీ చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘జయా బచ్చన్ ఎప్పుడూ ఇలానే చేస్తుంటుంది. సెల్ఫీ ఇవ్వటం ఇష్టం లేకపోతే. సున్నితంగా కుదరదు అనాలి కానీ, ఇలా తోసేస్తారా?’..‘ఆమెకు అభిమానులను ఎలా గౌరవించాలో తెలీదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
30 ఏళ్ల స్నేహం.. ఫ్రెండ్ భార్యతో ఎఫైర్ పెట్టుకుని
కారులో కూర్చుని డబ్బులు పంచిన ఎంపీ.. ఎగబడ్డ జనం..
Updated Date - Aug 13 , 2025 | 12:02 PM