ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: జపాన్‌లో హృదయవిదారక ఘటన.. జైల్లో ఉండేందుకు నేరాలకు దిగిన 81 ఏళ్ల వృద్ధురాలు!

ABN, Publish Date - Feb 02 , 2025 | 06:03 PM

ఒంటరితనం, ఆర్థికకష్టాలు తట్టుకోలేకపోయిన ఓ జపాన్ వృద్ధురాలు తనకు జైలు జీవితమే మంచిదని భావించింది. చివరకు ఆహారాన్ని చోరీ చేస్తూ కావాలనే పోలీసులకు చిక్కి జైలు పాలైంది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌ జనాభాలో వృద్ధుల వాటా భారీగా ఉంది. ఫలితంగా అనేక మంది వయసు మళ్లిన వారు ఆర్థిక, సామాజికంగా నరకం అనుభవిస్తున్నారు. ఒంటరితనం భరించలేక, డబ్బులు చాలాక చివరకు జైల్లో మాకం పెట్టేందుకు నేరాలకు దిగుతున్నారు. ఇందుకు సంబంధించి ఓ 81 ఏళ్ల వృద్ధురాలి ఉదంతం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

ఆహారం దొంగతనం చేసినందుకు గాను జైలు పాలైన 81 ఏళ్ల వృద్ధురాలు ఇటీవలే విడుదలయ్యారు. ఆమెకొచ్చే పెన్షన్ సరిపోక, ఆదుకోవాల్సిన కుమారుడు కూడా ఆమెను పట్టించుకోక పోవడంతో చివరకు కావాలనే నేరం చేసి జైలు పాలయ్యారు. ‘‘నేను చేసింది తప్పని ఇప్పుడు అనిపిస్తోంది. కానీ ఆర్థికంగా స్థిరంగా ఉండి ఉంటే ఇలా చేసుండేదాన్ని కాదేమో’’ అని ఆమె వాపోయింది (Viral).


Viral: ఐపీఎస్ బదిలీల్లో ఆసక్తికర ఘటన.. భార్య స్థానంలో భర్తకు జిల్లా ఎస్పీగా బాధ్యతలు!

జైలు కెళ్లకముందు అకియో తన 43 ఏళ్ల కుమారుడితో కలిసి ఉండేది. కానీ అతడికి ఆమె పొడ గిట్టేది కాదు. ఇంట్లోంచి వెళ్లిపోవాలని నిత్యం అంటుండే వాడు. దీనికి తోడు రెండు నెలలకు ఓసారి వచ్చే పెన్షన్ ఆమె ఖర్చులకు అస్సలు సరిపోయేది కాదు. దీంతో, ఆమె కష్టాలు తట్టుకోలేకపోయింది. ‘‘బతకడం నాకు వ్యర్థమనిపించింది. నాకేమైనా పర్వాలేదని అనుకున్నాను. చనిపోవాలని అనిపించింది’’ అని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది.


Uttarpradesh: దారుణం.. మరదలిని హత్య చేయించేందుకు రూ.40 వేలు అప్పు చేసి.. ఆపై..

ఆమెకు 60 ఏళ్ల వయసున్నప్పుడు తొలిసారి ఆమె ఆహారం చోరీ చేశారు. ఆ తరువాత కొడుకు నిరాదరణ, ఒంటరితనం, ఆర్థిక కష్టాలు వెరసి ఆమెకు జైలు జీవితమే బెటరని అనిపించింది. చివరకు మళ్లీ చోరీకి పాల్పడి జైలు కెళ్లింది. అయితే, కొడుకు తన గురించి మరింత చెడుగా ఆలోచిస్తాడేమో అని భయపడుతోంది. ‘‘ఒంటరిగా ఉండటం చాలా కష్టం. ఇలాంటి స్థితికి చేరుకున్నందుకు నాకు చాలా అవమానంగా ఉంది. ఆత్మస్థైర్యం ఉండి ఉంటే నా జీవితాన్ని మరింత భిన్నంగా తీర్చి దిద్దుకుని ఉండేదాన్నేమో. కానీ ఇప్పడు నేను చాలా ముసలి దాన్ని. నేను చేయగలిగింది ఏమీ లేదు’’ అని ఆమె విచారం వ్యక్తం చేసింది. అకియో ఉదంతం జపాన్‌లో అనేక మంది వృద్ధుల జీవితాలకు ప్రతిబింబమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2022 నుంచి జైలు శిక్ష పడిన వృద్ధ మహిళల్లో అధికశాతం మంది చోరీలే చేశారట.

Read Latest and Viral News,

Updated Date - Feb 02 , 2025 | 06:03 PM