Uttarpradesh: దారుణం.. మరదలిని హత్య చేయించేందుకు రూ.40 వేలు అప్పు చేసి.. ఆపై..
ABN , Publish Date - Feb 02 , 2025 | 04:07 PM
భార్య సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి చివరకు ఆమెను దారుణంగా హత్ చేశాడు. ఈ హత్య కోసం అతడు రూ.40 వేలు అప్పు చేసి మరీ దారుణానికి ఒడిగట్టాడు.

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాజధాని యూపీలో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. భార్య సోదరితో ఎఫైర్ పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను అడ్డు తొలగించుకునేందుకు దారుణంగా హత్య చేశాడు. మీరట్‌లో జనవరి 21న ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలిపై ఆమె సోదరి భర్త, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. మృతురాలి బావను ఆశిష్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడికి తన సోదరి భార్యతో ఎఫైర్ ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు (Uttarpradesh).
ఈ విషయంలో ఆమె తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని కక్ష పెంచుకున్న ఆశిష్ ఆమెను అడ్డుతొలగించుకునేందుకు శుభమ్, దీపక్‌ల సాయం తీసుకున్నాడు. ఆమెను హత్య చేసేందుకు వారు ఆశిష్‌తో రూ.30 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆశిష్ రూ.40 వేల లోన్ తీసుకున్నాడు. తొలుత నిందితులకు రూ.10 వేలు ఇచ్చి మిగితాది పని పూర్తయ్యాక ఇస్తానని అన్నాడు.
ఈ క్రమంలో ఆశిష్, శుభమ్, దీపక్ ముగ్గురు ఆమెను స్కూటర్‌పై ఎక్కించుకుని మీరట్‌లోని ఓ కాలవ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. చివరకు బాధితురాలి స్కార్ఫ్‌ను ఆమె మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతరం, మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయారు.
Viral Video: పిల్లలకు చపాతీలు చేస్తున్న తల్లి.. మధ్యలో తన ప్రేమను ఎలా చూపించిందో చూడండి..
మరోవైపు, మృతిరాలి కుటుంబసభ్యులు అప్పటికే ఆమె కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు సందర్భంగా బాధితురాలి చివరి సారిగా ఆశిష్, శుభమ్, దీపక్‌లతో వెళుతున్నట్టు తెలిసింది. దీంతో, పోలీసులు ఆశిష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ‘‘ఫారెన్సిక్ బృందాలు బాధితురాలి కాలిన మృతదేహం, దుస్తులు, రింగు, ఇతర వస్తువులను ఘటనా స్థలంలో గుర్తించారు. కండోమ్స్ ప్యాకెట్స్ కూడా అక్కడ ఉన్నాయి’’ అని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు పక్కాగా సేకరించి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని అన్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.