Gold allowed on Flights: ఈ కస్టమ్స్ రూల్స్ తెలుసా.. విమాన ప్రయాణికులు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చంటే..
ABN, Publish Date - Mar 06 , 2025 | 09:08 PM
కన్నడ నటి రన్యా రావు స్మగ్లింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు విమానాల్లో చట్టబద్ధంగా ఎంత బంగారం తెచ్చుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: కన్నడ నటి రన్య రావు భారీ మొత్తంలో బంగారాన్ని విమానాల్లో అక్రమరవాణా చేస్తూ పట్టబడ్డ వైనం సంచలనంగా మారింది. ఆమెకు సంబంధించి పలు ప్రాంతాల్లో రెయిడ్స్ నిర్వహించిన పోలీసులు మొత్తం రూ.2.06 కోట్ల విలువైన బంగారు నగలు, మరో రూ.2.67 కోట్ల భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా జనాల్ని షాక్‌కు గురి చేయడంతో బంగారం తరలింపునకు సంబంధించి కస్టమ్స్ నిబంధనలు ఏమిటీ అన్న చర్చ మొదలైంది. మరి చట్టబద్ధంగా విమానాల్లో ఎంత బంగారం తరలించొచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎగుమతి, దిగుమతులపై సుంకాలకు సంబంధించి సవివరమైన నిబంధనలను ఇండియన్ కస్టమ్స్ యాక్ట్ 1962లో పొందుపరిచారు. సుంకాల విధింపు, పర్యవేక్షణ సంబంధిత అంశాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ పర్యవేక్షిస్తుంది.
ఇక విదేశాల్లో ఉన్న భారతీయులు లేదా భారత సంతతి వారు (పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) తమ వెంట ఎంత బంగారం తెచ్చుకోవచ్చో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. వీటి ప్రకారం, విదేశాల్లో ఏడాదికి పైబడి ఉంటున్న భారతయ పురుషులు 20 గ్రాముు లేదా 50 వేల విలువైన బంగారాన్ని ఎటువంటి సుంకం చెల్లించకుండానే స్వదేశానికి తెచ్చుకోవచ్చు. ఇక మహిళలకు ఈ పరిమితిని 40 గ్రాములు లేదా రూ. లక్ష విలువైన నగలుగా నిర్ధారించారు.
Company with No women: పట్టుబట్టి మరీ మహిళలే లేని కంపెనీలో చేరాడు.. చివరకు ఏం జరిగిందంటే..
విదేశాల్లో కనీసం ఆరు నెలల పాటు ఉన్న భారతీ సంతతి వ్యక్తులు లేదా భారత పాస్‌పోర్టు ఉన్న వారు కూడా డ్యూటీ ఫ్రీ బంగారాన్ని తమ వెంట తెచ్చుకోవచ్చు. ఈ సమయంలో వారు 30 రోజుల లోపు ఇండియాకు వచ్చి వెళ్లిన సందర్భాలను పరిగణలోకి తీసుకోరు. ఒక వేళ డ్యూటీ ఫ్రీ మినహాయింపును క్లెయిమ్ చేసుకున్నట్టైతే మరో పర్యాయం వచ్చేటప్పుడు ఈ అవకాశం ఉండదు.
ఈ చట్టం ప్రకారం, పర్యాటకులు తమ వద్దు వస్తువుల జాబితాను ముందుగానే తెలియపరచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించే అవకాశం కూడా ఉంది.
Updated Date - Mar 06 , 2025 | 09:08 PM