Share News

Company with No women: పట్టుబట్టి మరీ మహిళలే లేని కంపెనీలో చేరాడు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Mar 03 , 2025 | 07:24 AM

మహిళా ఉద్యోగులే లేని కంపెనీలో వాతావరణం ప్రశాంతంగా ఎటువంటి రాజకీయాలు, డ్రామాలు లేకుండా ఉందంటూ ఓ గ్రాఫిక్ డిజైనర్ పెట్టిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టు పెట్టిన వ్యక్తిని జనాలు తెగ తిట్టి పోస్తున్నారు.

Company with No women: పట్టుబట్టి మరీ మహిళలే లేని కంపెనీలో చేరాడు.. చివరకు ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఆధునిక కాలంలో మానవ సమాజం ఎంతో పురోగతి సాధిస్తున్నా కొందరు మాత్రం బూజుపట్టిన భావాలతో ఉంటున్నారు. తాము చేస్తున్నదని తప్పని గుర్తించలేకపోవడమే కాకుండా, ఈ తప్పుడు భావాలను ఇతరులతో అవివేకంగా పంచుకుంటున్నారు. అయితే, ఇది సోషల్ మీడియా జమానా కాబట్టి జనాలు ఇలాంటి వాళ్లకు ఎలాంటి మొహమాటాలు లేకుండా ఇచ్చి పడేస్తున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా మరో ఉదంతం తెగ వైరల్ అవుతోంది. మహిళా ఉద్యోగులే లేని కంపెనీలో చేరానంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టుపై నెట్టింట పెద్ద రగడ జరుగుతోంది (Graphic Designer joins company with No Women).

ఢిల్లీకి చెందిన గ్రాఫిక్ అనురాగ్ మౌర్య తన మూర్ఖపు అభిప్రాయాలను నెట్టింట పంచుకుని అభాసుపాలయ్యాడు. జనాలు అతడిని తలంటేశారు. ఇటీవలే తాను ఓ కొత్త కంపెనీలో చేరానని చెప్పాడు. ఆ కంపెనీలో మహిళా ఉద్యోగులే లేరని, ఉన్న పురుషులందరూ 40 ఏళ్లకు పైబడిన వివాహితులేనని పేర్కొన్నారు. దీంతో, సంస్థలో ఒత్తిడి లేని వాతావరణంలో పనిచేయ గలుగుతున్నానని, ఎటువంటి డ్రామాలు నాటకీయ పరిణామాలు, రాజకీయాలు లేవంటూ గొప్పగా చెప్పుకుపోయాడు.


Woman Beats mother: ఈమె అసలు మనిషేనా.. ఆస్తి కోసం కన్నతల్లిని దారుణంగా..

అతడి పెట్టిన ఈ పోస్టుకు క్షణాల్లో నెట్టింట భారీ స్పందన వచ్చింది. అనురాగ్ మూర్ఖత్వాన్ని ఎత్తి చూపుతూ జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. మొహమాటాలేవీ పెట్టుకోకుండా నిలబెట్టి దులిపిపారేశారు. సంస్థల్లో రాజకీయాలను, నాటకీయతకు మహిళలే కారణమని భావించడం ఎంతవరకూ సబబని కొందరు ప్రశ్నించారు.

‘‘సర్.. నేను 20 మంది సభ్యులున్న టీంలో పనిచేస్తున్నా. మా టీమ్‌లో ఆరుగురు మహిళా ఉద్యోగులు ఉన్నారు. మేమంతా ఎంతో నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తుంటాము. కాబట్టి, అందరినీ ఒకేగాటన కట్టడం వివేకం అనిపించుకోదు. మీ గత అనుభాల్లో కొందరు ఇష్టారీతిన వ్యవహరించి ఉండొచ్చు. టీమ్‌లల్లో మహిళలు ఉండటం కూడా ఎంతో ముఖ్యం’’ అని ఓ వ్యక్తి అత్యంత మర్యాదగా సమాధానం ఇచ్చారు.


Hikers survives on Toothpaste: కొండల్లో తప్పిపోయి.. 10 రోజుల పాటు టూత్‌‌పేస్ట్ మాత్రమే తిని..

మరికొందరు మాత్రం అనురాగ్‌ను దుమ్ముదులిపి వదిలిపెట్టారు. ‘‘నీ ఆలోచన తప్పు బ్రో.. రాజకీయాలకు ఆగమగా తేడాలు ఉండు. అసలు పని ప్రదేశంలో విభిన్నత లేకపోతే చాలా డల్‌గా ఉంటుంది. పురుషులకు తట్టని ఆలోచనలు మహిళలకు ఉంటాయి. ఓ పనికి సంబంధించి ఓ కొత్త కోణాన్ని పరిచయం చేయగలరు. అయినా, మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారుగా.. అక్కడ డ్రామాను ఎలా తప్పించుకుంటున్నావు’’ అని షాకిచ్చాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌‌లో ఉంది.

జంటకు షాకింగ్ అనుభవం.. విమానంలో డెడ్ బాడీ పక్కను కూర్చుని ప్రయాణం

Read Latest and Viral News

Updated Date - Mar 03 , 2025 | 07:24 AM