Share News

Woman Beats mother: ఈమె అసలు మనిషేనా.. ఆస్తి కోసం కన్నతల్లిని దారుణంగా..

ABN , Publish Date - Mar 02 , 2025 | 08:11 AM

ఆస్తి కోసం కన్న తల్లికి నరకం చూపించిన ఓ హర్యానా మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Woman Beats mother: ఈమె అసలు మనిషేనా.. ఆస్తి కోసం కన్నతల్లిని దారుణంగా..

ఇంటర్నెట్ డెస్క్: కన్న తల్లిని రకరకాలుగా వేధించి నరకం చూపించిన ఓ రాకాసి కూతురి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె దారుణాలు చూసి జనాలు షాకైపోతున్నారు. నీ రక్తం తాగుతా.. అంటూ తల్లికి బతికుండగానే నరకం చూపించింది (Viral).

హర్యానాలోని హిసార్‌లోగల మోడర్న్ సాకేత్ కాలనీలో ఈ దారుణం వెలుగు చూసింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, నిందితురాలు రీటా తన తల్లి నిర్మలా దేవిని ఆస్తి తన పేరిట రాయాలని టార్చర్ పెట్టింది. నీ రక్తం తాగుతా అంటూ తల్లిని గట్టిగా కొరికింది. బాధ తాళలేక ఆమె విలవిల్లాడింది. వేధింపులు తట్టుకోలేక వృద్ధురాలు బోరున ఏడుస్తున్నా కనికరించని కూతురు ఆమెను ఇష్టారీతిన కొట్టింది. తలపై కొట్టింది. దుర్భాషలాడింది.


Hikers survives on Toothpaste: కొండల్లో తప్పిపోయి.. 10 రోజుల పాటు టూత్‌‌పేస్ట్ మాత్రమే తిని..

అల్లారముద్దుగా తనను పెంచి పెద్ద చేసిన తల్లిని హింసించింది. భలే మజా వస్తోంది.. నీ రక్తం తాగుతా అంటూ ఆమెను హింసిస్తూ పైశాచికానందం పొందింది. . జుట్టుపట్టి మంచం మీద నుంచి కిందకు లాగి నానా రకాలుగా హింస పెట్టింది. కనికరం చూపించాలని వేడుకుంటున్నా ఆమెలో ఇసుమంతైనా జాలి కనిపించలేదు. నీ వల్లే ఇలా హింస పెట్టాల్సి వస్తోంది అంటూ రెచ్చిపోయింది.

ఈ వీడియోను చూసిన బాధితురాలి కుమారుడు అమర్‌దీప్ సింగ్ ఒక్కసారిగా షాకైపోయాడు. ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తి కోసం తన సోదరి తల్లిని బందీగా చేసుకుని చిత్ర హింసలు పెడుతోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రీటాకు రెండేళ్ల క్రితం వివాహం చేస్తే ఆమె కొద్ది రోజులకే పుట్టింటికి తిరిగొచ్చేసిందని అన్నాడు. ఆ తరువాత తల్లిని ఆస్తి కోసం వేధించసాగిందని అన్నాడు.


మరోసారి తండ్రైన ఎలాన్ మస్క్! మొత్తం ఎందరు సంతానం అంటే..

కురుక్షేత్రలో ఉన్న రూ.65 లక్షల కుటుంబ ఆస్తిని తన పేరిట రాయాలంటూ తల్లిని టార్చర్ పెడుతోందని సోదరుడు అమర్‌దీప్ సింగ్ ఆరోపించాడు. తల్లిని చూసేందుకు తనను కూడా అనుమతించట్లేదని అన్నాడు. తప్పుడు కేసులు పెడతానంటూ తనను బెదిరించి తల్లిని చూడ కుండా చేసిందని అన్నాడు.

కాగా, ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. నిందితురాలు రీటాపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

జంటకు షాకింగ్ అనుభవం.. విమానంలో డెడ్ బాడీ పక్కను కూర్చుని ప్రయాణం

Read Latest and Viral News

Updated Date - Mar 02 , 2025 | 08:17 AM