Techie Job Struggles in India: టెకీకి షాక్.. 9 ఏళ్ల పాటు అమెరికాలో పని చేసి ఇండియాలో జాబ్‌కు అప్లై చేస్తే..
ABN , Publish Date - Mar 06 , 2025 | 06:38 PM
అమెరికాలో 9 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉన్నా భారత్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్‌లో దొరకక ఇబ్బంది పడుతున్న ఓ టెకీ ఉదంతం ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో 9 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన ఓ టెకీ భారత్‌లో జాబ్‌కు దరఖాస్తు చేస్తే ఊహించని షాక్ తగిలింది. తనకు ఏం చేయాలో పాలుపోవట్లేదంటూ టెకీ పెట్టిన పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది (Software Developer Returning To India struggles to find Job).
తాను గత 9 ఏళ్లుగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసినట్టు సదరు టెకీ చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులు వృద్ధులు కావడం, అనారోగ్యం బారిన పడటంతో వారి బాగోగులు చూసుకునేందుకు ఇండియా వస్తున్నట్టు తెలిపారు. మే నెలలో తాను భారత్‌కు షిఫ్ట్ అవుతానని అన్నారు. యూనివర్సిటీ మిషిగన్‌లో ఎమ్ఎస్ డిగ్రీ చేశానని, పైథాన్, డిజాంగో, జావా స్క్రిప్ట్, వీయూఈ.జేఎస్ పోస్ట్‌గ్రెస్ నైపుణ్యాలు ఉన్నాయని తెలిపారు. అనేక వెబ్ అప్లికేషన్లు, డాటా పైప్‌లైన్స్, డాటా విజువలైజేషన్స్ నిర్మించినట్టు వివరించారు. ఫుల్ స్టాక్ డమలప్‌మెంట్‌లో తనకు పూర్తిస్థాయి అనుభవం ఉందని తెలిపారు.
Company with No women: పట్టుబట్టి మరీ మహిళలే లేని కంపెనీలో చేరాడు.. చివరకు ఏం జరిగిందంటే..
ఇన్ని నైపుణ్యాలు, పని అనుభవం ఉన్నప్పటికీ భారత్‌లో జాబ్ దొరకడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 30 నుంచి 35 లక్షల శాలరీ ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఒకే ఒక సంస్థ నుంచి పిలుపు వచ్చిందని, కానీ ఇంటర్వ్యూ దశలో తన దరఖాస్తు తిరస్కరణకు గురైందని అన్నారు. తాను దరఖాస్తు చేసుకున్న ప్రతి జాబ్‌లో అర్హతలుగా క్లౌడ్ కంప్యూటింగ్, డాకర్, కూర్‌నెటీస్ అడుగుతున్నారని, కానీ తాను వీటిపై ఎప్పుడూ పనిచేయలేదని కూడా తెలిపారు.
Woman Beats mother: ఈమె అసలు మనిషేనా.. ఆస్తి కోసం కన్నతల్లిని దారుణంగా..
తన లాంటి సీనియర్‌కు ఇది తెలియాలని కంపెనీలు భావిస్తున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోవట్లేదని అన్నారు. తన తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా ఉండాల్సిన సమయంలో జాబ్ దొరక్కపోవడం ఇబ్బందిగా మారిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో సలహా ఇవ్వండని నెటిజన్లను రెడిట్ వేదికగా అభ్యర్థించారు.
‘‘మీ కెరీర్ అంతా యూనివర్సిటీల్లో గడిపినట్టు కనిపిస్తోంది. భారత్‌లో దీన్ని కొంత అసాధారణ పరిస్థితిగా చూస్తారు’’ అని ఓ వ్యక్తి అన్నారు. ఏదైనా కాలేజీలో జాబ్ కోసం ప్రయత్నిస్తే బాగుంటుందని, కానీ అక్కడ శాలరీలు ఐటీ రంగంతో పోలిస్తే తక్కువగా ఉంటాయని మరికొందరు చెప్పారు. భారతీయ ఐటీ రంగంలో పోటీ ఎక్కువగా ఉందని, రిఫరల్స్ తప్పనిసరి అని మరికొందరు చెప్పారు. భారత్‌లో బ్రాంచ్‌లు ఉన్న ఏదైనా అమెరికా కంపెనీలో చేరి ఆ తరువాత భారత్‌కు బదిలీ కావాలని కూడా సూచించారు.