ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gym Ravi: విలన్ గొప్ప మనసు.. సొంత ఖర్చులతో 101 మందికి కాశీ యాత్ర..

ABN, Publish Date - Jun 29 , 2025 | 08:56 PM

Gym Ravi: సినిమా నటుడు జిమ్ రవి గొప్ప మనసు చాటుకుంటున్నారు. 101 మందిని సొంత ఖర్చులతో కాశీ యాత్రకు తీసుకెళుతున్నారు. జూన్ 2వ తేదీన కాశీయాత్ర ప్రారంభం కానుంది.

Gym Ravi

ప్రముఖ తెలుగు విలన్ జిమ్ రవి గొప్ప మనసు చాటుకుంటున్నారు. 101 మందిని సొంత ఖర్చులతో కాశీ యాత్రకు తీసుకెళుతున్నారు. జూన్ 2వ తేదీన కాశీయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించిన విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. జిమ్ రవి మీడియాతో మాట్లాడుతూ.. ‘మనమంతా మధ్య తరగతికి చెందిన వాళ్లం. మా అమ్మ నాకు జీవితానికి సంబంధించిన ఎన్నో పాఠాలు నేర్పించింది. ‘ నువ్వు ఒకరితో సంతోషంగా లేకపోయినా.. అదో సమస్య కాదు.

వాళ్లకు కష్టం వచ్చినపుడు వారికి నువ్వు సాయం చేయాలి’ అని చెప్పింది. ఆ తర్వాత కొంత కాలానికి మా అమ్మ చనిపోయింది. దీంతో మా నాన్న చాలా దిగులు చెందాడు. నా దగ్గరకు వచ్చి..‘నన్ను కాశీ యాత్రకు తీసుకెళ్లు’ అని అడిగాడు. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. కాశీ యాత్రకు వెళ్లటం కుదరదని మా నాన్నకు గట్టిగా చెప్పాను. కొన్ని నెలల తర్వాత ఆయన మళ్లీ నన్ను అడిగాడు. ఈ సారి సరేనన్నాను. విమానంలో కాశీ తీసుకెళతానని చెప్పాను. స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని మా నాన్నను విమానంలో కాశీ యాత్రకు పంపడానికి టికెట్ బుక్ చేశాను. ఇంటికి వచ్చి అదే విషయం ఆయనకు చెప్పాను. కొన్ని గంటల్లోనే ఆయన చనిపోయారు. మా నాన్న చివరి కోరిక కూడా ఆయనతో పాటే చనిపోయింది. అందుకే మా నాన్న పేరు మీద పేద వారిని కాశీ యాత్రకు పంపుతున్నాను.

మా నాన్న చనిపోయి 14 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి డబ్బు కూడబెడుతున్నాను. ఆ రోజు రానే వచ్చింది. మొత్తం 101 మందిని జులై 2వ తేదీన కాశీ యాత్రకు పంపుతున్నాము. అన్ని ఖర్చులు మేమే భరిస్తున్నాము. మొదటగా రామ జన్మ భూమికి వెళతాము. అక్కడినుంచి ప్రయాగ్ రాజ్, కాశీ వెళతాము. అందరినీ క్షేమంగా యాత్రకు తీసుకువెళ్లి.. వెనక్కు తెచ్చే బాధ్యత మాదే. నేను ఇంకా కొంతమందికి ఆదర్శంగా నిలవాలని మా ఫ్రెండ్స్ చెప్పారు. అందుకే మీడియా ముందుకు వచ్చాను’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

టెస్లాతో మామూలుగా ఉండదు.. ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తాయి..

ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటే ఇన్ని ఇబ్బందులా..

Updated Date - Jun 29 , 2025 | 09:06 PM