ATM in Tuvalu: ఏటీఎమ్ ఓపెనింగ్.. ఆ దేశంలో ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారంటే
ABN, Publish Date - Apr 18 , 2025 | 07:09 PM
మనకు ఏటీఎమ్ ప్రారంభోత్సవం అన్నది చాలా చిన్న విషయం. బ్రాంచ్ మేనేజర్ లేదా సిబ్బంది వచ్చి ఏటీఎమ్‌ను ప్రారంభించి వెళ్లిపోతారు. సాధారణ జనం పెద్దగా పట్టించుకోరు. అయితే ప్రపంచంలో చిన్న దేశాలలో ఒక్కటైన తువాలులో మాత్రం ఏటీఎమ్ ఓపెనింగ్‌ను పెద్ద పండగలా చేసుకున్నారు.
మనకు సంబంధించినంత వరకు ఏటీఎమ్ (ATM Center) ప్రారంభోత్సవం అన్నది చాలా చిన్న విషయం. బ్రాంచ్ మేనేజర్ లేదా సిబ్బంది వచ్చి ఏటీఎమ్‌ను ప్రారంభించి వెళ్లిపోతారు. సాధారణ జనం పెద్దగా పట్టించుకోరు. అయితే ప్రపంచంలో చిన్న దేశాలలో ఒక్కటైన తువాలులో మాత్రం ఏటీఎమ్ ఓపెనింగ్‌ను పెద్ద పండగలా చేసుకున్నారు. ఏకంగా ప్రధాన మంత్రి హాజరై కేక్ కట్ చేశారు. ఎందుకంటే ఆ దేశంలో అదే తొలి ఏటీఎమ్ మరి (ATM in Tuvalu).
ఆస్ట్రేలియా, హవాయి మధ్యన పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న ద్వీప దేశం తువాలు. ఆ దేశ జనాభా కేవలం 11, 200 మాత్రమే. ఆ దేశ విస్తీర్ణం కేవలం 10 చదరపు మైళ్లు మాత్రమే. ఆ చిన్న దేశంలో ఈ నెల 15వ తేదీన తొలి ఏటీఎమ్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఏటీఎమ్ ఏర్పాటులో నేషనల్ బ్యాంక్ ఆఫ్ తువాలుకు పసిఫిక్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ సహకరించింది. ఈ కార్యక్రమానికి స్వయంగా తువాలు ప్రధాని ఫెలెటి టెయో స్వయంగా హాజరయ్యారు. ఈ ఏటీఎమ్ ఏర్పాటు దేశ చరిత్రలో చెప్పుకోదగ్గ మైలురాయి అని ప్రధాని అభివర్ణించారు.
కాగా, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టాలు పెరిగిపోవడం తువాలు దేశానికి పెను ముప్పుగా మారనుంది. తువాలు రాజధాని ప్రాంతం ఇప్పటికే 40 శాతం సముద్రంలో కలిసిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరకు ఈ దేశం మొత్తం సముద్రంలో కలిసిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ భూమిపై గ్లోబల్ వార్మింగ్‌కు బలయ్యే తొలి దేశం తువాలు అని పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 18 , 2025 | 07:09 PM