Viral: రూ.2300 పెట్టి డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుంటే ఇదా చేసేది.. నెట్టింట పేషెంట్ ఆవేదన
ABN, Publish Date - Feb 04 , 2025 | 06:52 PM
ఓ కార్పిరేట్ ఆసుపత్రిలో సీనియర్ డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుంటే ఆయన అసిస్టెంట్ తన కేసును పరిశీలించారంటూ ఓ వ్యక్తి అసంతృప్తి వ్యక్తం చేసిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: రూ.2300 పెట్టి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలోని సీనియర్ డైరెక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుంటే తనకు చివరకు నిరాశ ఎదురైందంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. కొందరు అతడి వాదనతో ఏకీభవిస్తే మరికొందరు మాత్రం విభేదించారు. సోషల్ మీడియాలో సదరు వ్యక్తి పంచుకున్న పోస్టుకు ఏకంగా 13 లక్షల వ్యూస్ వచ్చాయి (Viral). అసలు ఏం జరిగిందీ చెబుతూ అతడు సవివరమైన పోస్టు పెట్టాడు.
Trigger Fish Lips: ఈ పెదాలు ఎవరివో తెలిస్తే షాకైపోవాల్సిందే..
‘‘రూ.2300 పెట్టి ఢిల్లీ ఆపోలో ఆసుపత్రిలోని ఓ సీనియర్ డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నా. తీరా అక్కడకు వెళ్లాక సీనియర్ డాక్టర్ అసిస్టెంట్ వచ్చారు. నా కేసు గురించి 10 నుంచి 15 నిమిషాల పాటు చర్చించారు. ఆ తరువాత కాసేపటికి సీనియర్ డాక్టర్ వచ్చారు. నా గురించి కాసేపు తన అసిస్టెంట్‌తో చర్చించారు. మరోవైపు అసిస్టెంటే ఏం చేయాలి, ఏం చేయొద్దు అనే విషయాలపై సూచనలు సలహాలు ఇచ్చారు. మరి సీనియర్ డాక్టర్ సూచనలు సలహాలు, అనుభవం ఏమైనట్టు’’ అని యాదవ్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ తీరు సరైనదేనా అని ప్రశ్నించారు. అసిస్టెంట్‌తో కన్సల్టేషన్ బుక్ అయిన విషాయన్ని మాకు చెప్పరా? మేము సీనియర్ డాక్టర్‌తో అపాయిట్‌మెంట్ తీసుకున్నాము కదా’’ అని ప్రశ్నించారు.
Viral Video: ప్రేమికులు సరే.. పెళ్లైన వాళ్లూ ఇలా చేస్తే ఎలా?
కాగా, ఈ ఘటనపై నెట్టింట స్పందన వచ్చింది. అనేక మంది ఆసుపత్రి తీరును సమర్థించారు. దీంతో, ఎందుకు ఆసుపత్రిని సమర్థిస్తున్నారంటూ యాదవ్ మరోసారి ప్రశ్నించారు. ఓపీడీ అసిస్టెంట్ల కోసం ప్రత్యేకమైన అపాయింట్‌మెంట్లు ఉండాలని అన్నారు. వ్యాధి నిర్ధారణ ఏ డాక్టర్ చేయబోతున్నారనేది చెప్పాలని సూచించారు. నా సమస్య గురించి నేను నేరుగా సీనియర్ డాక్టర్‌తో చెప్పాలనుకున్నా. కానీ ఈ తీరు ఏంటో అర్థం కాలేదు’ అని వ్యాఖ్యానించారు. ఇక ఈ టాపిక్‌పై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా కొందరు ఆసుపత్రి తీరును కొందరు పేషెంట్ల హక్కులకు మద్దతుగా మాట్లాడారు.
Oyo: ఓయో వల్ల రైల్వే ప్లా్ట్‌ఫామ్‌పై నిద్ర పోయా.. కస్టమర్ ఆవేదన
Updated Date - Feb 04 , 2025 | 06:52 PM