ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: టాలెంట్ చూపిస్తున్న మొసలి పిల్ల..

ABN, Publish Date - Jun 15 , 2025 | 10:41 AM

Viral Video: ఓ వ్యక్తి చిన్న మొసలి పిల్లకు మాంసం ముక్క పెట్టాడు. దాన్ని పూర్తిగా మొసలికి ఇవ్వలేదు. గట్టిగా పట్టుకున్నాడు. అది ఆ మాంసం ముక్కను లాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ, దాని వల్ల కాలేదు.

Viral Video

మొసలి పట్టు గురించి మీకు తెలిసే ఉంటుంది. ఏనుగు అయినా సరే.. దాని పట్టునుంచి విడిపించుకోవటం చాలా కష్టం. అందుకే మొసలి నోటికి దొరికిన జీవులు చాలా వరకు వాటికి ఆహారం అవుతూ ఉంటాయి. జంతువుల్ని వేటాడేటప్పుడు మొసలి ఓ టెక్నిక్ ఫాలో అవుతుంది. ఏదైనా జంతువు దాని నోటికి దొరికిన తర్వాత.. అది తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ఉండటానికి మొసలి ఆ టెక్నిక్‌ను వాడుతుంది. దాన్నే డెత్ రోల్ అంటారు. మొసలి ఓ సారి డెత్ రోల్ చేస్తే.. 99 శాతం అవతలి జంతువు ప్రాణాలు పోయినట్లే..

దేవుడి సృష్టి ఎంత గొప్పదంటే.. ఈ డెత్ రోల్ టెక్నిక్ మొసలి పిల్లలకు పుట్టుకతోటే వచ్చేస్తుంది. చిన్న చిన్న మొసలి పిల్లలు కూడా డెత్ రోల్ చేస్తుంటాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి చిన్న మొసలి పిల్లకు మాంసం ముక్క పెట్టాడు. దాన్ని పూర్తిగా మొసలికి ఇవ్వలేదు. గట్టిగా పట్టుకున్నాడు. అది ఆ మాంసం ముక్కను లాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ, దాని వల్ల కాలేదు.

దీంతో తనకు పుట్టుకతో అబ్బిన విద్యను బయటపెట్టింది. మాంసం ముక్కను నోటితో కరుచుకుని గిరగిరా పల్టీలు కొట్టడం మొదలెట్టింది. అలా చాలా రౌండ్లు గిరగిరా తిరిగింది. ఎంతో నేర్పుగా డెత్ రోల్ చేసింది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ ఖాతాలో పోస్టయిన ఈ వీడియో 6 లక్షలకు పైగా వ్యూస్ తెచ్చుకుంది. ఇక, వైరల్‌గా మారిన ఆ వీడయోపై నెటిజన్లు స్పందిస్తూ..‘జంతువులకు ఇలాంటివన్నీ పుట్టుకతోటే వస్తాయి’..‘ఇంత లేదు..ఎలా రౌండ్లు తిరుగుతుందో చూడండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సార్.. నా పోస్టుమార్టం ఆపండి.. పోలీసులకు షాక్ ఇచ్చిన యువకుడు..

పాముతో స్టంట్.. ఇది అస్సలు ఊహించలేదు..

Updated Date - Jun 15 , 2025 | 10:41 AM