Ahmedabad Crash Survivor: విమాన ప్రమాదం.. బతికినా నరకం తప్పటం లేదు..
ABN, Publish Date - Jul 13 , 2025 | 10:50 AM
Ahmedabad Crash Survivor: 242 మంది ప్రయాణిస్తున్న విమానంలో రమేష్ ఒక్కడే బతకటం అదృష్టం అని అందరూ అనుకున్నారు. అతడికి మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డ సంతోషం లేదు. మానసికంగా కృంగిపోతున్నాడు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మొత్తం 275 మంది చనిపోయారు. విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది చనిపోయారు. కేవలం ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడే బ్రిటన్‌కు చెందిన 44 ఏళ్ల రమేష్ కుమార్. రమేష్ ఎమర్జెన్సీ డోరుకు దగ్గరగా ఉన్న 11ఏ సీటులో కూర్చున్నాడు. ప్రమాదం జరగగానే సీటు విరిగి దూరంగా పడిపోయింది. దీంతో మంటల్లో చిక్కుకోకుండా రమేష్ క్షేమంగా బయటపడ్డాడు. అయితే, ఈ ప్రమాదంలో రమేష్ అన్న అజయ్ చనిపోయాడు.
జూన్ 12వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. నిన్నటితో నెల రోజులు అయింది. ప్రాణాలతో బయటపడినందుకు రమేష్‌కు ఏ మాత్రం సంతోషం లేదు. అంతమంది చావును కళ్లారా చూడటం.. మరీ ముఖ్యంగా అన్న చనిపోవటంతో ట్రోమాకు గురయ్యాడు. రమేష్ సోదరుడు సన్నీ కుమార్ చెబుతున్న దాని ప్రకారం.. ‘ప్రమాదం తర్వాత ఇప్పటి వరకు రమేష్ కుటుంబసభ్యులతో తప్ప బయటి వాళ్లతో మాట్లాడలేదు. రాత్రిళ్లు సరిగా నిద్రపోవటం లేదు. నిద్రలోంచి సడెన్‌గా ఉలిక్కిపడుతున్నాడు.
మళ్లీ నిద్రపోలేకపోతున్నాడు. రెండు రోజుల క్రితం అతడ్ని సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లాము. అతడు లండన్ తిరిగి వెళ్లిపోవడానికి ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు’ అని చెప్పాడు. 242 మంది ప్రయాణిస్తున్న విమానంలో రమేష్ ఒక్కడే బతకటం అదృష్టం అని అందరూ అనుకున్నారు. అతడికి మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డ సంతోషం లేదు. మానసికంగా కృంగిపోతున్నాడు. ట్రోమా నుంచి బయటపడ్డానికి ఎంత కాలం పడుతుందో తెలీదు. ట్రోమానుంచి త్వరగా బయటపడాలని కోరుకోవటం తప్పితే.. కన్న తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి.
ఇవి కూడా చదవండి
భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిపోయిన రైలు..
అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దు
Updated Date - Jul 13 , 2025 | 11:01 AM