Shocking Video: నదిలో ఆనందంగా స్నానం చేస్తున్న వ్యక్తి.. కాలికి ఏదో తగలడంతో పైకి తీసి చూస్తే..
ABN, Publish Date - Mar 01 , 2025 | 07:06 PM
ఓ వ్యక్తి ఎంతో సంతోషంగా నదిలోకి దిగి స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తూ నవ్వుతూ వీడియో తీసుకుంటున్నాడు. పైన నీళ్లు వేసుకుంటున్నాడు. ఆ సమయంలో అతడి కాలికి ఏదో తగిలించింది. అతి కష్టం మీద దానిని పైకి తీసి చూస్తే అతడి గుండె గుభేల్‌మంది.
ఓ వ్యక్తి ఎంతో సంతోషంగా నది (River)లోకి దిగి స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తూ నవ్వుతూ వీడియో తీసుకుంటున్నాడు. పైన నీళ్లు వేసుకుంటున్నాడు. ఆ సమయంలో అతడి కాలికి ఏదో తగిలించింది. అతి కష్టం మీద దానిని పైకి తీసి చూస్తే అతడి గుండె గుభేల్‌మంది. వెంటనే దానిని పారేసి వేగంగా ఒడ్డు మీదకు వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. ఆ వీడియో తీస్తున్న వ్యక్తి కూడా షాక్‌కు గురయ్యాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Viral Video).
bajoellente11 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి నదిలోకి దిగి నీటిలో సరదాగా గడుపుతున్నాడు. అతని స్నేహితుడు పడవ నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాడు. నదిలో ఉన్న వ్యక్తి నీటిని శరీరంపై వేసుకుని ఆనందంగా ఉన్నాడు. అకస్మాత్తుగా, అతడి కాలికి ఏదో తగిలింది. నీటిలోకి వంగి దానిని చేతులతో పట్టుకున్నాడు. బయటకు తీశాక చూస్తే అది ఓ మొసలి పిల్ల. తన చేతుల్లో మొసలి (Crocodile) ఉందని గ్రహించిన వెంటనే, ఆ వ్యక్తి ఆ జంతువును తిరిగి నీటిలోకి విసిరేశాడు. భయంతో పారిపోవడానికి ప్రయత్నించాడు. అరుస్తూ, అతను నీటిలోంచి బయటపడి పరిగెత్తి పడవలోకి దూకాడు.
ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను దాదాపు కోటి మంది వీక్షించారు. 6.5 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పాపం.. పెద్ద చేప దొరికిందని సంతోషపడ్డాడు``, ``అతడు చాలా అదృష్టవంతుడు``, ``ఇంకెప్పుడూ నదిలోకి దిగడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Bike stunt goes wrong: ఎంత పని చేశావు బ్రదర్.. బైక్ ఎక్కిన ప్రేయసికి నడుం విరగ్గొట్టావ్ కదా..
Optical Illusion: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలో దెయ్యం ఎక్కడుందో 5 సెకెన్లలో కనుక్కోండి..
Snake Viral Video: వామ్మో.. ఇది మామూలు ఫైట్ కాదు.. పాముల పోరాటం ఇంత భయంకరంగా ఉంటుందా?
Optical Illusion: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ పుస్తకాల మధ్య తాళం చెవిని 5 సెకెన్లలో కనుగొనండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 01 , 2025 | 07:06 PM