Bike stunt goes wrong: ఎంత పని చేశావు బ్రదర్.. బైక్ ఎక్కిన ప్రేయసికి నడుం విరగ్గొట్టావ్ కదా..
ABN , Publish Date - Mar 01 , 2025 | 04:37 PM
యువత అతి వేగంగా బైక్ నడుపుతూ రేస్‌లు, స్టంట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ మరింత పెరిగింది. విచిత్రమైన స్టంట్లు చేయడం, ఆ వీడియోలను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి వైరల్ చేయడం ట్రెండ్‌గా మారింది.
బైక్‌ల మీద స్టంట్ చేయడం చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా యువత అతి వేగంగా బైక్ నడుపుతూ రేస్‌లు, స్టంట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ మరింత పెరిగింది. విచిత్రమైన స్టంట్లు చేయడం (Bike Stunts), ఆ వీడియోలను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి వైరల్ చేయడం ట్రెండ్‌గా మారింది. అయితే ఆ క్రమంలో కొందరు భారీ ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కూడా అదే జరిగింది. ఆ ప్రమాదంలో ఓ అమ్మాయి ప్రమాదానికి గురి కావడం విషాదకరం (Bike stunt Video).
@Human101Nature అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఓ అమ్మాయిని వెనుక సీటు మీద కూర్చోపెట్టుకుని అతి వేగంగా బైక్ నడపుతున్నాడు. వేరే వ్యక్తులు వీడియో తీస్తుండగా ఆ యువకుడు రెచ్చిపోయి ఫీట్లు చేశాడు. వేగంగా వెళ్లడమే కాకుండా, బైక్ ముందు చక్రాన్ని గాల్లోకి లేపడానికి ప్రయత్నించాడు. ముందు చక్రం పైకి లేపి అతి వేగంగా బైక్‌ను ముందుకు పోనిచ్చాడు. కొద్ది సేపటి తర్వాత బైక్ బ్యాలెన్స్ తప్పడంతో వెనుక కూర్చున్న అమ్మాయి కింద పడిపోయింది. అతడి చేతి నుంచి బైక్ జారిపోయి ముందుకు వెళ్లిపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3. 3లక్షల మంది వీక్షించారు. 1900 మందికి పైగా లైక్ చేశారు. ఆ బైక్ డ్రైవ్ చేసిన వ్యక్తిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ``వీరిద్దరిలో ఎవరిది పెద్ద మూర్ఖత్వం. బైక్ నడిపే వ్యక్తిదా? అతడి వెనుక కూర్చున్న అమ్మాయిదా``, ``నమ్మి వచ్చిన అమ్మాయి నడుం విరగ్గొట్టాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూాడా చదవండి..
Optical Illusion: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలో దెయ్యం ఎక్కడుందో 5 సెకెన్లలో కనుక్కోండి..
Snake Viral Video: వామ్మో.. ఇది మామూలు ఫైట్ కాదు.. పాముల పోరాటం ఇంత భయంకరంగా ఉంటుందా?
Optical Illusion: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ పుస్తకాల మధ్య తాళం చెవిని 5 సెకెన్లలో కనుగొనండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..