Viral News: ఫుడ్ స్టాల్ బోర్డుపై స్పెల్లింగ్ మిస్టేక్.. పొరపాటుగా నిజం చెప్పేశాడంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..
ABN, Publish Date - Jan 28 , 2025 | 06:35 PM
ఫన్నీ మీమ్స్, ఫొటోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటో చూస్తే నవ్వు రాక తప్పదు. ఆ ఫొటోలో ఓ ఫుడ్ స్టాల్ బోర్డు కనబడుతోంది. దానిపై రాసిన ఇంగ్లీష్ పదంలో స్పెల్లింగ్ మిస్టేక్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు, ఫొటోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫన్నీ మీమ్స్ (Funny Memes), ఫొటోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటో చూస్తే నవ్వు రాక తప్పదు. ఆ ఫొటోలో ఓ ఫుడ్ స్టాల్ బోర్డు కనబడుతోంది. దానిపై రాసిన ఇంగ్లీష్ పదంలో స్పెల్లింగ్ మిస్టేక్ (Spelling Mistake) చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral News).
@VishalMalvi అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ ఫొటో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ ఫొటో ఓ ఫుడ్ స్టాల్ బ్యానర్‌ది. ఆ బ్యానర్ మీద ``ఆల్ డిసీజెస్ అవైలబుల్`` అని రాసి ఉంది. నిజానికి అక్కడ ``ఆల్ డిషెస్ అవైలబుల్`` అని రాద్దామనుకున్నాడు. అయితే ``డిషెస్`` (Dishes)కు బదుల్ ``డిసీజెస్`` (Diseases) అని రాశాడు. డిసీజెస్ అంటే వ్యాధులు అనే అర్థం ఉందనే సంగతి తెలిసిందే. ఓ వ్యక్తి ఆ ఫుడ్ స్టాల్ బ్యానర్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
ఆ వైరల్ ఫొటోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేసి కామెంట్లు చేశారు. ``స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, అర్థం మాత్రం సరైనదే``, ``బ్రదర్ మరీ ఇంత నిజాయితీ అయితే వ్యాపారం ఎలా చేస్తావు``, ``ఆ ఫుడ్ స్టాల్ ఓనర్ పొరపాటులో నిజం చెప్పేశాడు``, ``నిజమే, అక్కడ వ్యాధులు మాత్రమే దొరుకుతాయి``, ``నాకు ఆ ఫుడ్ స్టాల్ ఓనర్ నిజాయితీ నచ్చింది`` అంటూ నెటిజన్లు ఫన్నీగా తమ స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Strange Job: ఓర్నీ.. ఇలా కూడా కోట్లు సంపాదించవచ్చా? ఈ వ్యక్తి జాబ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..
Viral Video: స్కూటీ మీద వేగంగా వెళ్తున్న యువతికి అడ్డొచ్చిన బారికేడ్.. ఆమె ఏం చేసిందో చూడండి..
Optical Illusion: మీ కంటి చూపు అద్భుతం అయితే.. ఈ బాత్రూమ్‌లో కారు బొమ్మ ఎక్కడుందో కనిపెట్టండి..
Viral Video: విమానంపై నేరుగా పడిన పిడుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 28 , 2025 | 06:35 PM