ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BJP MLA Mahesh Trived: జీతంతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో 10% కమీషన్‌

ABN, Publish Date - Sep 13 , 2025 | 04:06 AM

ఎమ్మెల్యేలుగా తమకి వచ్చే వేతనాలతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో 10 శాతం కమీషన్‌ కూడా తీసుకుంటున్నామని ఏకంగా ఓ ఎమ్మెల్యేనే అందరి ముందు...

కాన్పూర్‌, సెప్టెంబరు 12: ఎమ్మెల్యేలుగా తమకి వచ్చే వేతనాలతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో 10 శాతం కమీషన్‌ కూడా తీసుకుంటున్నామని ఏకంగా ఓ ఎమ్మెల్యేనే అందరి ముందు బహిరంగంగా వెల్లడించారు. కాన్పూర్‌లో బీజేపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కిద్వాయ్‌ నగర్‌ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్‌ త్రివేది ఈ వ్యాఖ్యలు చేశారు. తాము రెండు రకాలుగా లాభం పొందుతున్నా, క్షేత్ర స్థాయిలో ఉండే కార్యకర్తలకు మాత్రం ఏ ప్రతిఫలమూ దక్కడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మహేశ్‌ త్రివేది వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రాజకీయ వర్గాల్లో ఇది సంచలనం సృష్టించింది. కాగా, సదరు వీడియోపై మహేశ్‌ త్రివేది కానీ, బీజేపీ అధిష్ఠానం కానీ స్పందించలేదు.

Updated Date - Sep 13 , 2025 | 04:06 AM