Indian Tea: భారతీయులు టీలో పాలు ఎందుకు కలుపుకుంటారో తెలుసా
ABN, Publish Date - Oct 13 , 2025 | 10:34 PM
పాలతో టీ చేసే విధానం భారత్ మినహా ఇతర దేశాల్లో పెద్దగా కనిపించదు. అయితే, మనదేశంలో ఈ అలవాటు ప్రారంభం కావడం వెనక ఆసక్తికర కథనం ఉంది
19వ శతాబ్దలంలో భారతీయులకు టీని బ్రిటిషర్లే పరిచయం చేశారు. కానీ మనవాళ్లు మాత్రం తమ అభిరుచికి తగ్గట్టు తీ తయారీ విధానానికి మార్పులు చేశారు.
టీ వినియోగాన్ని భారత్‌లోనూ పెంచాలని బ్రిటిషర్లు తొలుత భావించారు. ఓ కొత్త మార్కెటింగ్ వ్యూహాన్ని అమలు చేశారు. స్థానికులను తమకు నచ్చిన విధంగా టీ చేసుకోమని ప్రోత్సహించారు.
ఈ క్రమంలో భారతీయులు తమ అభిరుచి మేర ప్రయోగాలు చేశారు. ప్రతి ఇంట్లో అందుబాటులో ఉండే పాలను టీకి జోడించడంతో కొత్త రుచి వచ్చింది. అలా, ప్రస్తుతం మనం తాగే టీ ఉనికిలోకి వచ్చింది.
తేయాకు రుచిని యథాతథాంగా ఆస్వాదించాలని భావించిన ఇతర దేశాలు మాత్రం కేవలం నీటితో టీ చేసుకోవడాన్ని కొనసాగించాయి.
అప్పటికే భారత్‌లో అనేక పానీయాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో, బ్రిటిషన్లు తెచ్చిన టీకి మనవాళ్లు రకరకాల సుగంధ ద్రవ్యాలు జోడించి కొత్త ఫ్లేవర్స్‌ను తయారు చేసుకున్నారు.
వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌లో పాడి పంటలకు కొదవు లేదు. దీంతో, టీ పాలను జోడించే సరికి ఆ కొత్త రుచి అందరికీ నచ్చింది. మనసుకు ఓ కొత్త సంతృప్తిని ఇచ్చింది.
భారత్‌లో కూడా టీ చేసే విధానంలో ప్రాంతాల వారీగా తేడాలు ఉన్నాయి. కొందరు టీకి పాలతో పాటు ఇలాచీలు జోడిస్తే మరికొందరు ఉప్పు, అల్లం వంటివి జత చేస్తారు.
అలా ప్రపంచరీతులకు భిన్నంగా భారతీయులు తమ అభిరుచి తగ్గట్టు కొత్త టీ రెసిపీని సిద్ధం చేసుకున్నారు.
Updated Date - Oct 13 , 2025 | 10:37 PM