Unusual Museums: ప్రపంచంలోని ఈ వింత మ్యూజియాల గురించి తెలుసా
ABN, Publish Date - Sep 25 , 2025 | 10:37 PM
మ్యూజియం అంటే సాధారణంగా పురాతన వస్తువులే ఉంటాయని అనుకుంటాం. జంతువుల పునరుత్పత్తి అవయవాలు మొదలు మహిళలు దానం చేసిన శిరోజాల వరకూ అనేక రకాల వింతలను పదర్శించే మూజియంలు కూడా ఉన్నాయి.
క్రొయేషియాలోని మ్యూజియం ఆఫ్ బ్రోకెన్ రిలేషన్ షిప్‌లో జనాలు తామ పాత బంధాలకు గుర్తుగా మిగిలిన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు.
ఐస్‌ల్యాండ్‌లోని ఫాలోలాజికల్ మ్యూజియంలో వివిధ జాతుల జంతువుల పునరుత్పత్తి అవయవాలను ప్రదర్శనకు పెట్టారు.
మెక్సికో తీరంలో సముద్రం అడుగున ఏర్పాటు చేసిన కాన్‌కాన్ అండర్ వాటర్ మ్యూజియంలో వాస్తవ వస్తువులంత పరిమాణంలో ఉన్న వివిద శిల్పాలను ఏర్పాటు చేశారు. పగడపు దిబ్బల పరిరక్షణ కోసం దీన్ని ఏర్పాటు చేశారు.
భారత్‌లో సులభ్ ఇంటర్నేషనల్ టాయిలెట్ మ్యూజియంలో పరిశుభ్రత వ్యవస్థల చరిత్ర, టాయిలెట్స్, పారిశుధ్య నిర్వాహణకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకోవచ్చు.
లీడ్స్ (యూకే)లోని డాగ్ కాలర్స్ మ్యూజియంలో కుక్కలను కట్టేందుకు ఉపయోగించే మెడ పట్టీలు, గొలుసులను ప్రదర్శిస్తారు. 16శ శతాబ్దం నాటి డాగ్ కాలర్స్‌ను కూడా ఇక్కడ చూడొచ్చు.
జపాన్‌లోని మోమోఫోకో మ్యూజియంలో రామెన్ నూడుల్స్ చరిత్ర గురించి తెలుసుకోవచ్చు.
టర్కీలోని ఆవనాస్ హెయిర్ మ్యూజియంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు దానం చేసిన శిరోజాలతో జడలు అల్లి ప్రదర్శనకు పెట్టారు.
మసాచుసెట్స్‌లో మ్యూజియం ఆఫ్ బ్యాడ్ ఆర్ట్స్‌లో జనాల విమర్శలపాలైన కళాఖండాలు, చిత్రాలను వీక్షించొచ్చు.
Updated Date - Sep 25 , 2025 | 10:37 PM