Nasal Infections: ఈ కాలంలో నేసల్ ఇన్ఫెక్షన్లు నిరోధించేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు
ABN, Publish Date - Sep 22 , 2025 | 11:15 PM
వానా కాలంలో నేసల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు పలు చర్యలు తీసుకోవాలి. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం
వానా కాలంలో ఇంట్లో తడి దుస్తులు, వస్తువులు, తేమ పీల్చుకున్న గోడలు వంటివి వాటిల్లో ఫంగస్, బాక్టీరియా పెరిగి ముక్కుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.
ఇంట్లో గాలి, వెలుతురు పుష్కలంగా ఉండేలా చర్యలు తీసుకుంటే తేమ తగ్గి ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.
ఉప్పు కలిపిన శాలైన్ నీటితో ముక్కు రంధ్రాలను శుభ్రం చేసుకుంటే ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది.
విటమిన్ సీ, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న ఆహారం తినడం, నీరు తగినంత తాగడం వంటి వాటితో ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్ల పీడ తగ్గుతుంది
వర్షంలో తడవాల్సి వస్తే వీలైనంత త్వరగా తడి దుస్తులను మార్చుకోవాలి. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్‌తో చేసిన దుస్తుల వల్ల కూడా ఇన్ఫెక్షన్ల అవకాశం తగ్గుతుంది.
తడిసిన టవల్స్, షూస్ వంటివి ఈ కాలంలో ఎక్కువ సేపు ధరిస్తే ముక్క ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.
యూకలిప్టస్ నూనె లేదా ఆలోవీరా కలిపిన నూనెతో ఆవిరి పట్టడం వల్ల ముక్కులో మ్యూకస్ క్లియర్ అయ్యి ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది
ఈ కాలంలో వ్యక్తిగత శుభ్రత పాటించడం, రోగ నిరోధక శక్తి బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం
Updated Date - Sep 22 , 2025 | 11:16 PM