Marriage Advice: ఈ పొరపాట్లు చేస్తే మీ వివాహ బంధం విచ్ఛిన్నం
ABN, Publish Date - Oct 19 , 2025 | 11:08 PM
వివాహ బంధం విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
జీవిత భాగస్వామి విజయాలను చూసి అతిగా ఈర్ష్య పడితే వివాహ బంధం బీటలు వారుతుంది.
జీవిత భాగస్వామిని చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూడటం కూడా అసలుకు ఎసరు తెస్తుంది.
దంపతుల ఆంతరంగిక విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అనుమతించడం కూడా భార్యాభర్తల బంధాన్ని బలహీనపరుస్తుంది
అవతలి వారికి అతిగా షరతులు, నిబంధనలు విధించడం వల్ల కూడా దంపతుల మధ్య పరస్పర గౌరవం సన్నగిల్లుతుంది.
పనంతా అవతలివారిపై నెట్టి రెండవవారు తమకేమీ పట్టనట్టు ఉంటే భార్యాభర్తల మధ్య అసంతృప్తి మొదలవుతుంది.
అభిప్రాయభేదాలు తలెత్తినప్పుడు ప్రశాంతంగా మాట్లాడకుండా వాదులాటకు దిగితే బంధం బలహీనమవుతుంది.
ఇగోలకు పోకుండా క్షమాపణలు చెబితే కోపాలు త్వరగా చల్లారి భార్యాభర్తలు మళ్లీ ఒక్కటైపోతారు.
జీవిత భాగస్వామి మనోభావాలకు విలువివ్వకుండా విమర్శలు చేస్తుంటే బంధం ఇట్టే తెగిపోతుంది.
Updated Date - Oct 19 , 2025 | 11:11 PM