Ecofriendly Living: పర్యావరణహిత జీవనానికి సింపుల్ టిప్స్
ABN, Publish Date - Oct 22 , 2025 | 11:12 PM
పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా జీవించాలనుకునే వారు ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుందాం
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. మీ వెంట బాటిల్స్, స్టీల్ స్పూన్స్, బ్యాగ్ వంటవి తీసుకెళితే ప్లాస్టిక్ వస్తువుల అవసరం తగ్గుతుంది.
దుస్తులను తక్కువగా కొనుగోలు చేయాలి. ఉన్న వాటిని జాగ్రత్తగా ఎక్కువకాలం వినియోగిస్తే పర్యావరణంపై ప్రభావం తగ్గుతుంది.
స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు, సీజనల్ ఆహారాలను తింటే కూడా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం తగ్గించిన వారు అవుతారు.
నీటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నీటి వనరులను అస్సలు దుర్వినియోగం చేయకూడదు
వ్యక్తిగత వాహనాలకు బదులు ప్రజారవాణా సాధాలనాలను ఎక్కువగా వినియోగిస్తే సమస్య తగ్గుతుంది.
ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లు వంటివి వాడనప్పుడు ఆఫ్ చేసి పెడితే విద్యుత్ ఆదా అయ్యి పర్యావరణానికి మేలు కలుగుతుంది.
ఇంట్లో అతిగా సామాన్లు పేర్చకుండా వీలైనంత తక్కువగా కొనుగోళ్లు చేస్తే కూడా పర్యావరణానికి మేలు కలిగించిన వారవుతారు.
Updated Date - Oct 22 , 2025 | 11:12 PM