Emotional Baggage: అలర్ట్.. మీ పార్టనర్‌లో ఈ లక్షణాలు ఉంటే..
ABN, Publish Date - Oct 05 , 2025 | 10:53 PM
మీ భాగస్వామిలో ఎమోషనల్ బ్యాగేజీ ఉంటే రకరకాల రూపాల్లో అది బయటపడుతుంది. మరి ఈ ఎమోషనల్ బ్యాగేజీ ఎమిటో, దీని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం పదండి
గత బంధాలతో మనసుపై పడిన ప్రభావం ప్రస్తుతం అనుబంధాలను ప్రభావితం చేస్తుంది. దీన్నే ఇంగ్లిష్‌లో ఎమోషనల్ బ్యాగేజ్ అంటారు.
ఈ మానసిక భారాన్ని మోసేవాళ్లల్లో సాధారణంగా కనిపించే లక్షణాలు కొన్ని ఉంటాయి. వీటిని ముందుగానే గుర్తిస్తే కొన్ని దిద్దుబాటు చర్యలను చేపట్టొచ్చు.
చిన్న విషయాలను అతిగా రియాక్ట్ అవుతున్నారంటే మానసిక సమస్యల్లో ఉన్నట్టే. ఇలాంటి వారితో మనసు విప్పి మాట్లాడితే సమస్యలు తొలగిపోతాయి.
మునుపటి బంధాలు మిగిల్చిన గాయాలు కొందరిలో అపనమ్మకాన్ని పెంచుతాయి. ఇలాంటి వారికి నమ్మకం కలిగించేలా ప్రవర్తిస్తే అన్ని అనుమానాలు తొలగిపోతాయి.
తమ పాత పార్టనర్‌లతో భాగస్వాములను పోలుస్తున్నారంటే మనసులో అసంతృప్తి ఉన్నట్టే. ఈ సమస్యలకు కూడా మనసు విప్పి మాట్లాడుకోవడమే మార్గం.
గత అనుభవాలతో పశ్చాత్తాపం చెందే వారు తమ జీవితం వ్యర్థమని అనుకుంటారు. ఇలాంటి వారు కూడా తమ భాగస్వాములకు మానసకింగా దగ్గరకాలేరు.
భాగస్వామితో లోతైన సంభాషణలు జరపలేనని వారు కచ్చితంగా అభద్రతాభావానికి గురవుతున్నట్టే. ఇలాంటి వారి భయాలు తొలగించేలా మాట్లాడితే పరిస్థితి మెరుగవుతుంది.
పాత విషయాలను తవ్వితీస్తూ మాట్లావారికి మనసులో అసంతృప్తి పాతుకుపోయినట్టే. ఇలాంటప్పుడు సమస్యలో లోతుగా నిష్పాక్షిక దృష్టితో విశ్లేషిస్తే పరిస్థితి మెరుగవుతుంది.
Updated Date - Oct 05 , 2025 | 10:53 PM