Contact Lens: ఎక్కువసేపు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే వచ్చే సమస్యలు ఇవే
ABN, Publish Date - Oct 06 , 2025 | 10:28 PM
ఎక్కువ సేపు కాంటాక్ట్స్ లెన్స్ పెట్టుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే పలు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఎక్కువ సేపు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల కార్నియాకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. కార్నియల్ ఎడిమా అనే వాపు వస్తుంది.
అధిక సమయం కాంటాక్ట్ లెన్స్‌ను వాడేవారికి కెరాటైటిస్ అనే కంటి ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది.
కొందరిలో ప్రమాదకరమైన కార్నియల్ అల్సర్ తలెత్తి కంటి చూపును కోల్పోయే ముప్పు ఏర్పడుతుంది.
ఇక ఎక్కువ సమయం పాటు కాంటాక్ట్ లెన్స్ వాడే వారిలో కళ్లు, ఎర్రబడటం, దురదలు వంటి సమస్యలు కూడా ఉంటాయి.
మ్యూకస్ ఉత్పత్తి కూడా పెరిగి లెన్స్‌పై పేరుకుంటుంది. ఫలితంగా కంటి చూపు మసకబారినట్టు అనిపిస్తుంది.
ఎక్కువ సేపు కాంటాక్ట్ లెన్స్ వాడేవారిలో మైక్రోస్కోపిక్ సిస్టులు కూడా ఏర్పడతాయి. ఇవి కార్నియా లోపలికి చొచ్చుకుపోయి కంటికి మరింత హాని చేస్తాయి.
అయితే, కాంటాక్ట్ లెన్స్ వాడటం మానేసిన వెంటనే చాలా వరకూ సమస్యలు తొలగిపోతాయి. చికిత్స తీసుకోకపోతే మాత్రం పెద్ద సమస్యలు తలెత్తే అవకాశం కచ్చితంగా ఉంటుంది.
Updated Date - Oct 06 , 2025 | 10:28 PM