ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Relationship Warning Signs: ఈ మార్పులు కనిపిస్తే మీ భాగస్వామిలో అసంతృప్తి మొదలైనట్టే

ABN, Publish Date - Oct 10 , 2025 | 08:20 PM

ఆలుమగలు, ప్రేమ జంటల మధ్య బంధం బలపడాలంటే మానసిక సాన్నిహిత్యం అవసరం. లేకపోతే అసంతృప్తి మొదలవుతుంది. మరి మీ భాగస్వామిలో అసంతృప్తి మొదలైందనేందుకు ప్రధాన సంకేతాలు ఇవే

1/8

మీ భాగస్వామి అంటీముట్టనట్టుగా, దూరంగా ఉంటున్నారా? లోతైన సంభాషణలకు బదులు ముక్తసరి మాటలతో మాటలు ముగిస్తున్నారా? ఈ మార్పులు వారిలో పొడచూపిన అసంతృప్తికి ముఖ్య సంకేతాలు

2/8

భాగస్వామితో సంతోషంగా లేని వారు శారీరక సాన్నిహిత్యానికీ దూరంగా ఉంటారు.

3/8

అనవసర చికాకులు, చీటికీ మాటికి తగాదాలు, దూరంగా మసులుకోవడం వంటివన్నీ మీ భాగస్వామి సంతోషంగా లేరనేందుకు సూచనలు

4/8

గతంలో మీతో సంతోషంగా పంచుకున్న విషయాలను ఇప్పుడు దాచి పెడుతూ దూరంగా ఉంటున్నారన్నా అనుమానించాల్సిందే.

5/8

చిన్న చిన్న విషయాలు, పొరపాట్లపై కూడా అతిగా విమర్శలు, తూలనాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారంటే వారిలో ఏదో అసంతృప్తి మొదలైందని అర్థం

6/8

భవిష్యత్తు కోసం కలిసి ప్రణాళికలు వేసుకునేందుకు, కలిసి పనులు చేసేందుకు విముఖత చూపడం కూడా మానసిక దూరం పెరుగుతోందనేందుకు సంకేతాలు

7/8

భవిష్యత్తు కోసం కలిసి ప్రణాళికలు వేసుకునేందుకు, కలిసి పనులు చేసేందుకు విముఖత చూపడం కూడా మానసిక దూరం పెరుగుతోందనేందుకు సంకేతాలు

8/8

మీతో రిలేషన్‌షిప్‌పై ఉన్న అసంతృప్తిని ఇతరుల ముందు వెళ్లగక్కుతున్నారంటే మీ భాగస్వామి మీతో సంతోషంగా లేరని అర్థం.

Updated Date - Oct 10 , 2025 | 08:20 PM