Pregnancy After 35: 35 ఏళ్ల దాటాక సంతానం కోసం ప్రయత్నించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ABN, Publish Date - Sep 27 , 2025 | 11:02 PM
35 ఏళ్లు దాటిన మహిళలు ప్రెగ్నెసీ కోసం ప్లాన్ చేసేటట్టైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
35 ఏళ్ల తర్వాత సంతానం కోసం ప్రయత్నించే మహిళలు తమ హార్మోన్ల స్థాయిలు, ఆండాశయ స్థితిని పరీక్షించుకోవడం చాలా ముఖ్యం.
సాధారణంగా అందుబాటులో ఉండే సమాచారాన్ని విశ్వసించే బదులు మార్గదర్శకత్వం కోసం వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి
గర్భధారణ సమయంలో మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది కాబట్టి ముందుగానే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
జన్యులోపాలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు జన్యు పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా ప్రమాదాలను ముందే తగ్గించుకోవచ్చు
సమతుల ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ వంటి జీవనశైలీ అలవాట్లు ఈ వయస్సులో మరింత కీలకం.
చాలా మంది మహిళలు 30ల చివర్లోకి రాకముందే అండాల నిల్వ కోసం ఎగ్ ఫ్రీజింగ్‌ను ఆశ్రయిస్తే సమస్యలను చాలా వరకూ నివారించవచ్చు
లేటు వయసులో గర్భధారణతో వచ్చే సమస్యలపై ముందుగానే అవగాహన పెంచుకుంటే సరైన ప్రణాళికతో సంతాన భాగ్యం పొందొచ్చు
సకాలంలో వైద్య పరీక్షలు, అవగాహనతో కూడిన నిర్ణయాలు, ఆరోగ్యకర అలవాట్లతో 35 ఏళ్ల తర్వాత కూడా మహిళలు సంతాన భాగ్యం పొందొచ్చు
Updated Date - Sep 27 , 2025 | 11:02 PM