PCOS: పీసీఓఎస్ ఉన్న వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
ABN, Publish Date - Sep 29 , 2025 | 10:42 PM
మహిళల్లో హార్మోన్ సమస్యల కారణంగా తలెత్తే వ్యాధిని పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ (పీసీఓఎస్) అని అంటారు. ఈ వ్యాధిపై జనాల్లో అవగాహన పెరిగి అపోహలు తొలగిపోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పీసీఓఎస్ అరుదుగా వచ్చే వ్యాధి అనుకోవడం పొరపాటు. రుతక్రమం సరిగా లేని మహిళల్లో సుమారు 10 నుంచి 30 శాతం మంది దీని బారిన పడుతున్నారు.
హైపర్ ఆండ్రోజెనిజమ్, రుతుక్రమం సరిగా లేకపోవడం, అల్ట్రా సౌండ్ పరీక్షల్లో ఓవేరియన్ ఫాలికల్స్ వంటివి పీసీఓఎస్‌కు ప్రధాన సంకేతాలు
పీసీఓఎస్ ఉన్న మహిళల్లో ఏఎమ్ఎహ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అంతమాత్రాన వారికి సంతానభాగ్యానికి వారు దూరమైనట్టు భావించకూడదు
పీసీఓఎస్ కారణంగా అండ విడుదలకు అడ్డంకులు ఏర్పడతాయి. అయితే, ఈ సమస్య ఉన్న వారు సంతానం పొందడం అసాధ్యమేమీ కాదు
పీసీఓఎస్ ఉన్న వారితో పాటు వారి భాగస్వాములకు కూడా పరీక్షలు నిర్వహించడం అత్యవసరం. వీర్య కణాల నాణ్యత, ఆరోగ్యం వంటివి చెక్ చేసి ప్రెగ్నెన్సీపై వైద్యులు తగు సలహాలు ఇస్తారు.
బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమ తప్పకుండా కసరత్తులు చేయడం వంటివి అండ విడుదలను పునరుద్ధరించి ప్రెగ్నెన్సీ అవకాశాలను పెంచుతాయి.
రుతుక్రమాన్ని క్రమబద్ధీకరించే ఔషధాలు, అండం విడుదలను ప్రేరేపించే మందులు, ఓవేరియన్ డ్రిల్లింగ్ వంటి చర్యలు, కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో పీసీఓఎస్ ఉన్న వారు సంతానం పొందొచ్చు
పీసీఓఎస్ ఉన్న వారికి ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్, బీపీ కారణంగా కొంత రిస్క్ ఉన్నప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ రిస్క్‌ను సులభంగా అధిగమించవచ్చు.
Updated Date - Sep 29 , 2025 | 10:42 PM