WHO Report: 2030 కల్లా ప్రపంచంలో 16 శాతం మంది వృద్ధులే
ABN, Publish Date - Oct 02 , 2025 | 10:19 PM
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సంతానోత్పత్తి తగ్గుతోంది. వృద్ధుల జనాభా పెరుగుతోంది. 2030 నాటికల్లా ప్రపంచంలోని ప్రతి ఆరుగురిలో ఒకరి వయసు 60 పైబడి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, 2030 కల్లా ప్రపంచంలోని ప్రతి ఆరుగురిలో ఒకరు 60 ఏళ్ల పైబడి వయసుకు చేరుకుంటారు.
80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 2050 కల్లా మూడు రెట్లు పెరిగి 426 మిలియన్‌లకు చేరుకుంటుంది
వ్యక్తులు ఆయుర్దాయాన్ని వారి ఆరోగ్యంతో పాటు ఆర్థిక, సామాజిక పరిస్థితులు నిర్ణయిస్తాయి.
ప్రపంచంలోని వృద్ధుల్లో మూడింట రెండు వంతులు మధ్యాదాయ, అల్పాదాయ దేశాల్లోనే ఉంటారు.
2021-2030 దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి డెకేడ్ ఆఫ్ హెల్తే ఏజింగ్‌గా ప్రకటించింది. వృద్ధులకు గౌరవప్రదమైన జీవనం, రక్షణ, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
వృద్ధుల సంఖ్య పెరిగే కొద్దీ ఆరోగ్య వ్యవస్థలపై దీర్ఘకాలిక రోగాల భారం, ఆర్థిక ఒత్తిడులు పెరుగుతాయి.
వృద్ధుల పట్ల వివక్ష తొలగించేందుకు వృద్ధులకు అనుకూల వాతావరణాన్ని సమాజంలో ఏర్పాటు చేసేందుకు నడుం బిగించాలని ఐక్యరాజ్య సమితి వివిధ దేశాలకు పిలుపునిచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజల సగటు ఆయుర్దాయం పెరుగుతున్నా వృద్ధులకు గౌరవప్రదమైన జీవనం ఇచ్చే మౌలిక వసతులు, వ్యవస్థలు ఇంకా అందుబాటులో లేవని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
Updated Date - Oct 02 , 2025 | 10:24 PM