Keto Diet: కీటో డైట్‌తో కలిగే ప్రయోజనాలు కలిగే ఇబ్బందులు
ABN, Publish Date - Oct 04 , 2025 | 10:42 PM
ఇటీవల కాలంలో కీటో డైట్ బాగా పాప్యులర్ అవుతోంది. మరి ఈ డైట్‌తో వచ్చే ప్రయోజనాలు, సమస్యలు ఏంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం
కొవ్వులు అధికంగా, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే డైట్‌ను కీటో డైట్ అని పిలుస్తారు.
టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వారి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచేందుకు ఈ డైట్ ఉపయోగపడే అవకాశం ఉంది.
కిటోసిస్ ప్రక్రియ ద్వారా విడుదలయ్యే కీటోన్‌లు సమర్థవంతమైన శక్తి వనరుగా పనిచేస్తాయి. మెదడుకు రక్షణగా నిలుస్తాయి.
ఫిట్స్‌తో సతమతమయ్యే చిన్నారులకు కీటో ఫుడ్స్ సమస్య నుంచి కొంత సాంత్వన లభిస్తుంది.
కిటో డైట్‌తో శరీరం ఫ్యాట్స్ వినియోగం వైపు మళ్లుతుంది. ఫలితంగా బరువు త్వరగా తగ్గుతారు.
అయితే, అధిక శాచ్యురేటెడ్ కొవ్వుల కారణంగా ఎల్‌డీఎల్ కొలెస్టెరాల్ పెరిగి గుండుపోటు ముప్పు అధికం అవుతుంది.
ఇక కీటో డైట్ మొదలెట్టిన కొత్త కీటో ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. నిరీసం, తలతిరిగినట్టు ఉండటం, కడుపులో తిప్పడం, తలనొప్పి వేధిస్తాయి.
అయితే, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఫుడ్‌తో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, వంటి పోషకాలు లోపించే అవకాశం ఉంది.
Updated Date - Oct 04 , 2025 | 10:42 PM