Job Interview: మొదటి సారి ఇంటర్వ్యూకు వెళుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ABN, Publish Date - Sep 21 , 2025 | 10:19 PM
మొదటిసారి ఇంటర్వ్యూకు వెళ్లేవారు కొన్ని టిప్స్ ఫాలో కావాలి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ముందుగా మీరు చేరబోయే కంపెనీ గురించి తెలుసుకోండి. కంపెనీ లక్ష్యాలు, బాధ్యతల గురించి తెలుసుకోండి
జాబ్ డిస్క్రిప్షన్‌ను జాగ్రత్తగా చదివి ఏ నైపుణ్యాలు, అర్హతలు ఉండాలో తెలుసుకోండి.
రెస్యూమేలో మీ బలాలు, విజయాలకు సంబంధించిన వివరాలను పొందుపరచండి.
‘మీ గురించి చెప్పండి’, ‘మీ బలహీనతలు లేదా బలాలు ఏమిటి?’ వంటి సాధారణ ప్రశ్నలకు ముందుగానే సమాధానాలు రెడీ చేసుకోండి.
కంపెనీ డ్రెస్ కోడ్‌కి తగ్గట్టు ప్రొఫెషనల్‌గా డ్రెస్ అవ్వండి, మొదట్లో మనల్ని చూడగానే మంచి అభిప్రాయం కలిగేలా వ్యవహరించండి
ఇంటర్వ్యూ కోసం కాస్తంత ముందుగా ఇంట్లోంచి బయలుదేరండి. సమయానికి ఇంటర్వ్యూకు చేరుకునేలా ప్లాన్ చేయండి
ఇంటర్వ్యూయర్ మీరూ కొన్ని ప్రశ్నలను అడగండి. ఇది ఉద్యోగంపై మీకున్న ఆసక్తిని తెలియజేస్తుంది.
ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. బాడీ లాంగ్వేజ్ హుందాగా ఉండేలా జాగ్రత్త పడండి.
Updated Date - Sep 21 , 2025 | 10:21 PM