Jeff Bezos: వ్యాపారవేత్తలుగా ఎదగాలనే యువతకు జెఫ్ బెజోస్ సూచన ఇదే
ABN, Publish Date - Oct 07 , 2025 | 11:14 PM
లైఫ్‌లో ఓ వ్యాపారవేత్తగా ఎదిగేందుకు యువత ఏం చేయాలనేదానిపై ఎందరో అనేక సలహాలు ఇస్తున్నారు. ఈ విషయంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన సూచనలు తెలియజేశారు.
వ్యాపారం, ఉద్యోగానికి సంబంధించి మౌలిక నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం ఉన్న సంస్థలో యువత పని చేయాలని జెఫ్ బెజోస్ సూచించారు.
వినియోగదారులతో టచ్‌లో ఉండాల్సిన జాబ్స్ చేస్తే బాధ్యత, సమయపాలన, మానవసంబంధాల నిర్వహణకు సంబంధించిన మెళకువలు తెలుస్తాయని జెఫ్ బెజోస్ సూచించారు.
పటిష్ఠ నిర్మాణం ఉన్న సంస్థల్లో పని చేస్తే పని నిర్వహణ, మేనేజీరియల్ నైపుణ్యాలు యువతకు అలవడతాయని అన్నారు.
బిల్ గేట్స్, జకర్‌బర్గ్ లాగా కాలేజీ చదువును మధ్యలో మానేసినా భారీ సంస్థలు నెలకొల్పగలగడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని హెచ్చరించారు. చదువును నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.
త్వరిత గతిన విజయం సాధించాలన్న కోరికను పక్కనపెట్టి నిదానంగా మౌలిక నైపుణ్యాలు నేర్చుకోవాలని ఆయన తెలిపారు.
అమెజాన్‌కు ముందు దశాబ్దాం పాటు గడించిన అనుభవమే తనకు సంస్థను తీర్చిదిద్దడంలో ఉపయోగపడిందని అన్నారు.
ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తమ రంగంలో ముందు ప్రాథమిక అనుభవం ఉంటే వ్యాపారంలో మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు.
మంచి కంపెనీల్లో మౌలిక వ్యాపార నైపుణ్యాలు నేర్చుకున్నాక సొంత సంస్థలను ఏర్పాటు చేయాలని జెఫ్ బెజోస్ యువతకు సూచించారు.
Updated Date - Oct 07 , 2025 | 11:21 PM