Cleanse Arteries: ధమనులను శుభ్రపరిచి రక్తప్రసరణను మెరుగుపరిచే ఫుడ్స్
ABN, Publish Date - Oct 04 , 2025 | 11:09 PM
కొన్ని రకాల ఫుడ్స్ తింటే ధమనుల లోపలి భాగాలు శుభ్రపడి రక్త ప్రసరణ మెరుగవుతుంది. మరి ఈ ఫుడ్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
వయసు పెరిగే కొద్దీ ధమనుల్లో కొవ్వులు, కాల్షియం పేరుకుపోయి రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇది రక్తపోటు, స్ట్రోక్, హైబీపీ ముప్పును పెంచుతుంది
అయితే, ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటే వ్యర్థాలు తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందుకోసం కొన్ని ఫుడ్స్ తప్పనిసరిగా తినాలి
బీటా గ్లూకాన్ ఫైబర్ సమృద్ధిగా ఉండే ఓట్స్ తింటే ఎల్‌డీఎల్ కొలెస్టరాల్ తగ్గి ధమనుల్లోపల వ్యర్థాలు పేరుకునే ముప్పు తగ్గుతుంది.
క్వెర్‌సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే మునగ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి ధమనుల్లో సాగే గుణం పెంచుతుంది
క్వెర్‌సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే మునగ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి ధమనుల్లో సాగే గుణం పెంచుతుంది
మెంతి గింజలు కూడా కొలెస్టెరాల్ స్థాయిలను తగ్గించి ధమనుల్లో కొవ్వు పేరుకునే ముప్పును నివారిస్తాయి.
కరివేపాకులోని కామ్‌ఫెరాల్ వ్యర్థాల ఆక్సిడేషన్‌ను నిరోధించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
కసరత్తులు చేయకపోవడం, నిద్రలేమి, అధిక ఒత్తిడి వంటివన్నీ ధమనుల్లో ప్లాక్స్ పేరుకునేలా చేసి సమస్యను పెంచుతాయి.
Updated Date - Oct 04 , 2025 | 11:09 PM