Headaches-Empty Stomach: భోజనం చేయకపోతే తలనొప్పి.. ఇలా ఎందుకంటే..
ABN, Publish Date - Oct 17 , 2025 | 10:38 PM
భోజనం చేయనప్పుడు తలనొప్పి వస్తుంటుందా? ఇలా ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఓ పూట భోజనం మానేసినా లేక ఎక్కువ సేపు ఆకలితో గడిపినా కొందరికి తలనొప్పి వస్తుంది.
ఇలాంటి తలనొప్పులకు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడమే కారణం. చక్కెర స్థాయిలు తగ్గితే మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిన సందర్భాల్లో శరీరంలో కార్టిసాల్, అడ్రనలిన్ అనే హార్మోన్‌లు విడుదల అవుతాయి. ఇవి తలనొప్పికి దారి తీస్తాయి.
ఈ సమస్యకు డీహైడ్రేషన్ కూడా తోడయితే తలనొప్పి మరింత తీవ్రం అవుతుంది
మైగ్రేన్ తలనొప్పి ఉన్న వారు ఎక్కువ సేపు ఏమీ తినకుండా ఉంటే తలనొప్పి ఎక్కువవుతుంది.
ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రతి 4 గంటలు లేదా 6 గంటలకు ఒకసారి స్వల్ప మొత్తంలో ఆహారం తీసుకోవాలి.
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు ఉన్న సమతులాహారం, తగినంత నీరు తీసుకుంటే షుగర్ స్థాయిల్లో ఒడిదుడుకులు తగ్గి తలనొప్పి బెడద ఉండదు.
Updated Date - Oct 17 , 2025 | 10:40 PM