Emotional Habits: మానసిక దృఢత్వాన్ని దెబ్బతీసే అలవాట్లు
ABN, Publish Date - Oct 16 , 2025 | 10:20 PM
మానసిక దృఢత్వాన్ని దెబ్బతీసే అలవాట్లను వెంటనే వదిలించుకోవాలి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం
నిత్యం ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటూ ఉంటే అసంతృప్తి, ఒత్తిడి పెరుగుతాయి. అభివృద్ధి, సంతోషాలను దూరం చేస్తాయి.
భవిష్యత్తులో రాబోయే సమస్యలను ముందుగానే ఊహించుకుని, అతిగా భయపడితే మానసిక దృఢత్వం తగ్గుతుంది. ఏకాగ్రత, సమతౌల్యత దెబ్బతింటాయి.
భావోద్వేగాలను మనసులోనే అణిచిపెట్టుకుని ఉంటే ఆందోళన పెరిగి సంతోషం, ఉత్సాహం తగ్గిపోతాయి.
గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లను మనసులోనే పెట్టుకుంటే ఆలోచనల్లో క్లారిటీ లోపించి, ప్రశాంతత నశిస్తుంది.
మొహమాటం, లేదా మరొక కారణంగా ఇతరులు చెప్పిన దానికల్లా తల ఊపుతూ ఉంటే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
ప్రతి పని గొప్పగా చేయాలన్న ప్రయత్నంలో చాదస్తానికి పోతే పనులు ఆలస్యం అయ్యి అసలుకే ఎసరు వస్తుంది. వైఫల్యాలు ఎదురై మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
మన సామర్థ్యాలు, విజయాలకు ఇతరుల పోగడ్తలు, ఆమోదాన్ని కొలమానంగా మార్చుకుంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోయి మానసిక దౌర్బల్యం ఆవరిస్తుంది
భావోద్వేగాలు, ఆలోచనలను సరిగ్గా నియంత్రించలేకపోతే దీర్ఘకాలంలో మానసికంగా అలసిపోయి, వివిధ రుగ్మతలు ఆవరించే ప్రమాదం ఉంది.
Updated Date - Oct 16 , 2025 | 10:24 PM