Fruits For Pregnent Women : ప్రెగ్నెంట్ మహిళలు తప్పనిసరిగా తినాల్సిన పండ్లు ఇవే
ABN, Publish Date - Oct 10 , 2025 | 11:01 PM
కడుపుతో ఉన్న మహిళలు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు తప్పనిసరిగా తినాలి. మరి గర్భిణులకు మేలు చేసే పండ్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
అరటి పండ్లలోని పొటాషియం, విటమిన్ బీ-6తో అలసట, కండరాల నొప్పులు, కడుపులో తిప్పడం వంటివి దూరమవుతాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫోలేట్ అధికంగా ఉండే ఆకాడోలతో గర్భస్థ శిశువు మెదడు ఆరోగ్యంగా ఎదుగుతుంది. నాడీ వ్యవస్థ బలోపేతం అవుతుంది.
యాపిల్స్‌లోని అధిక ఫైబర్ కారణంగా జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. విటమిన్ ఏ, సీ కారణంగా ఆస్థమా, అలర్జీలు దరిచేరవు
జామలోని విటమిన్ సీ, ఫైబర్, పీచు పదార్థం వల్ల బీపీపై నియంత్రణ, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. న్యూరల్ ట్యూబ్‌లో లోపాలు తలెత్తవు
మామిడి పండ్లు గర్భస్థ శిశువు ఎదుగుదలకు దోహదపడతాయి. అయితే, అధిక చక్కెరల కారణంగా వీటిని పరిమితంగానే తినాలి.
నారింజ పండ్లు తింటే రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. కడుపులోని శిశువు కణజాలం, మెదడు అభివృద్ధికి ఇవి దోహద పడతాయి.
దానిమ్మలోని ఐరన్, విటమిన్ కే, యాంటీఆక్సిడెంట్స్ రక్తహీనతకు అడ్డుకట్ట వేస్తాయి. బిడ్డకు రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి.
స్ట్రాబెర్రీలు గర్భిణులకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షణ ఇస్తాయి. రోగనిరోధక వ్యవస్థను, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Updated Date - Oct 10 , 2025 | 11:01 PM