Evening Habits: రాత్రిళ్లు పడుకునే ముందు ఇలా చేస్తే మరుసటి రోజు ఫుల్ ఎనర్జీ
ABN, Publish Date - Oct 14 , 2025 | 10:48 PM
రాత్రి కంటి నిండా నిద్రపట్టి మరుసటి రోజు ఫుల్ ఎనర్జీతో లేవాలనుకునే వారు కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో తెలుసుకుందాం
రాత్రిళ్లు పడక గదిలో లావెండర్, చందనం సువాసనలు వెదజల్లే అగరత్తులను ఏర్పాటు చేసుకుంటే మెదడు రిలాక్స్ అయ్యి గాఢ నిద్ర పడుతుంది.
రాత్రి పడుకునే మందు మనసుకు సాంత్వన ఇచ్చే సంగీతం వింటే ఒత్తిడి తగ్గుతుంది. మంచి నిద్రపట్టి మరుసటి రోజు పూర్తి ఉత్సాహంతో నిద్రలేస్తారు
పడుకునే ముందు 5 నుంచి 10 నిమిషాల పాటు పలుమార్లు సుదీర్ఘ శ్వాస తీసుకుని వదిలితే రాత్రి మంచి నిద్రపట్టి మరుసటి రోజు ఉదయం హ్యాపీగా నిద్ర లేస్తారు.
పడక గదిలో రాత్రిళ్లు తక్కువ స్థాయి వెలుతురు ఉండేలా చూసుకుంటే శరీరంలో మెలటోనిన్ విడుదలై మంచి నిద్రపడుతుంది. మరుసటి రోజుకు అలసట అంతా వదిలిపోయి ఫుల్ ఎనర్జీతో నిద్ర లేవగలుగుతారు.
పుదీనా, నిమ్మ టీ వంటివి తాగితే నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. గాఢ నిద్ర పట్టి శరీరం పూర్తిస్థాయిలో కోలుకుంటుంది.
నిద్రకు ఉపక్రమించే ముందు ఒంటిని బాగా స్ట్రెచ్ చేస్తే పట్టేసినట్టు ఉన్న కండరాలు రిలాక్స్ అవుతాయి. దీంతో మంచి నిద్రపట్టి అలసట మొత్తం వదిలిపోతుంది.
మరుసటి రోజు ఏం చేయాలనే అంశాలను ఓ లిస్టు చేసుకుని ఆ ప్రకారం పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటే మనసుపై ఒత్తిడి తగ్గి మంచి నిద్రపడుతుంది.
గోరు వెచ్చటి నీటితో స్నానం కూడా మనసును, శరీరాన్ని రిలాక్స్ అయ్యేలా చేసి గాఢ నిద్రపట్టేలా చేస్తుంది.
Updated Date - Oct 14 , 2025 | 10:52 PM