High Protein Food: అధిక ప్రొటీన్ ఫుడ్స్‌తో కండలు పెరుగుతాయనుకోవడం భారీ మిస్టేక్
ABN, Publish Date - Sep 23 , 2025 | 10:43 PM
అధిక ప్రొటీన్లు తింటే కండరాలు బాగా పెరుగుతాయని అనుకుంటున్నారా. ఇది చాలా పెద్ద తప్పని నిపుణులు చెబుతున్నారు. మరి వాస్తవం ఏంటో తెలుసుకుందాం పదండి
ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల కండలు బాగా పెరుగుతాయని అనుకోవడం తప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రొటీన్ ఫుడ్స గురించి అధిక శాతం మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంపెనీలు చేసే ప్రచారం తప్పుదారి పట్టించేదిగా ఉంటుంది.
పప్పులు, పాలు, గుడ్లు, చికెన్, వేరుశెనగలు వంటి ఫుడ్స్‌తో రోజూ కావాల్సినంత ప్రొటీన్ సహజసిద్ధంగా శరీరానికి అందుతుంది.
జీర్ణ వ్యవస్థ సమస్యలు, నోటి దుర్వాసన, నీరసం, అలసట లేదా చిరాకు పెరగడం వంటివి పరిమితికి మించి ప్రొటీన్ తింటున్నారనేందుకు సంకేతాలు
అధిక ప్రోటీన్ వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి కలిగించవచ్చు, ముఖ్యంగా ఇప్పటికే సమస్యలు ఉన్నవారికి ప్రమాదకరం.
శరీరానికి కావాల్సినంత శక్తి కోసం ప్రొటీన్లతో పాటు కార్బోహైడ్రేట్లు, మెదడు ఆరోగ్యానికి కొవ్వులు ఉన్న సమతుల ఆహారాన్ని తినాలి.
కండరాల పెరుగుదల కోసం భోజనంలో గరిష్ఠంగా 40 గ్రాముల ప్రొటీన్ ఉంటే సరిపోతుంది.
కసరత్తులు వంటివి చేయని వారు తమ బరువును బట్టి కేజీకి గరిష్ఠంగా 1 గ్రాము ప్రొటీన్ తీసుకుంటే సరిపోతుంది. ఇతరులు కేజీ బరువుకు రెండు గ్రాముల వరకూ ప్రొటీన్ తీసుకోవాలి.
Updated Date - Sep 23 , 2025 | 11:04 PM