Confidence Building Measures: మీ పిల్లలతో ఈ మాటలంటే వారి కాన్ఫిడెన్స్ డబుల్
ABN, Publish Date - Sep 20 , 2025 | 10:38 PM
పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచేందుకు వారిని ప్రోత్సహిస్తూ మాట్లాడాలి. మరి ఏ కామెంట్స్‌తో పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచచ్చో ఈ కామెంట్‌తో తెలుసుకుందాం.
నీ మీద నాకు నమ్మకం ఉంది అన్న మాటలు పిల్లల్లో నిరాశను దూరం చేసి ఉత్సాహాన్ని పెంచుతాయి.
తప్పులు చేయడం సహజం, పొరపాట్లు చేస్తేనే తెలివితేటలు పెరుగాయి అన్న మాటలు పిల్లల్లో భయాన్ని పోగొడతాయి
బాగా కష్టపడ్డావు, పని చేశావు అన్న మాటలను కూడా పిల్లల్లో నూతనోత్తేజాన్ని తీసుకొస్తాయి.
ప్రతి పనీ గొప్పగా చేయడం కంటే నిజాయతీతో శక్తమేరకు పనిచేయడం గొప్పదన్న విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి
పిల్లల మనోభావాలు, అభిప్రాయాలకు విలువనివ్వడం కూడా వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది
పిల్లలు ఏదైనా సొంతంగా నేర్చుకుని పనిని చక్కబెడితే ప్రశంసలతో ముంచెత్తాలి. దీంతో, పిల్లల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది
పిల్లలు చేసే పనుల్లో పెద్దలు కూడా పాలుపంచుకుని ప్రోత్సహిస్తే వారిలో అనవసర సంకోచాలు దూరమైన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలుగుతారు
Updated Date - Sep 20 , 2025 | 10:38 PM