World Fastest Train: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు.. గంటకు 450 కి.మీ.
ABN, Publish Date - Oct 26 , 2025 | 01:01 PM
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదిగా కొత్త హై-స్పీడ్ రైలు ఉద్భవించింది. ఇది అత్యధిక ఆపరేటింగ్ వేగంలో అద్భుతమైన రికార్డులను సృష్టించింది. ఈ రైలు సాంకేతికతలో కొత్త పుంతలు తొక్కుతోంది.
ఇది US లేదా జపాన్‌లో తయారైంది కాదు. మన దాయాది చైనా తయారు చేసిన అద్భుతం
చైనా తయారు చేసిన CR450 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా అవతరించింది.. కొత్త రికార్డును నెలకొల్పింది.
ఈ రైలు యొక్క అత్యధిక వేగం గంటకు 450 కి.మీ.గా నమోదు. ఆపరేటింగ్ వేగం గంటకు 400 కి.మీ.
ఈ హై స్పీడ్ రైలు వాణిజ్య కార్యకలాపాలు 2026లో ప్రారంభమయ్యే అవకాశం
యునైటెడ్ స్టేట్స్‌లోని చైనా రాయబార కార్యాలయం ట్రయల్ వీడియోను షేర్ చేసి, ఇది చైనా CR450, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు అని పేర్కొంది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ రైలు గురించి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు
రైల్వే వ్యవస్థ భవిష్యత్ డిజైన్, అధునాతన సాంకేతికతను ప్రశంసిస్తూ నెట్టింట్లో పోస్టులు
Updated Date - Oct 26 , 2025 | 01:24 PM