Chia Side-effects: ఈ సమస్యలున్న వాళ్లు చియా గింజలు తినకుండా ఉంటే బెటర్
ABN, Publish Date - Sep 30 , 2025 | 10:48 PM
కొన్ని రకాల అనారోగ్యాలు ఉన్న వారు చియా గింజలను మితంగా తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సమస్యలేంటో వివరంగా తెలుసుకుందాం.
చియా గింజల్లో ఫాస్ఫరస్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ సమస్యలున్న వాళ్లు వీటికి దూరంగా ఉంటే మంచిది.
బ్లడ్ థిన్నర్స్, చియా గింజలు రెండు కలిసి బ్లీడింగ్ ముప్పు పెంచే అవకాశం ఉంది. కాబట్టి, ఈ ఔషధాలు వాడేవారు అప్రమత్తంగా ఉండాలి.
ఇరటబుల్ బోవెల్ సిండ్రోమ్‌తో బాధపడే వారు చిగా గింజలు తింటే గ్యాస్, కడుపుబ్బరం, నొప్పి, ఇతర సమస్యలు కలిగే అవకాశం ఉంది.
నట్స్, గింజలు అంటే ఎలర్జీ ఉన్న వారికి చియా గింజల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి.
నట్స్, గింజలు అంటే ఎలర్జీ ఉన్న వారికి చియా గింజల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి.
చిగా గింజలు విషయంలో వైద్యుల సలహాసూచనల మేరకే ముందుకెళ్లాలని నిపుణులు చెప్పే మరోమాట
నానబెట్టిన చియా గింజలను రోజుకు ఒక టీస్పూన్‌కు మించి తినకుండా ఉండే ఎలాంటి ఇబ్బందులు ఉండబోమని అనుభవజ్ఞులు చెప్పే మాట
ముఖ్యంగా చియా గింజలపై ఎంత ఇష్టం ఉన్నా పరిమితంగా తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - Sep 30 , 2025 | 10:53 PM