ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Overhydration Risks: అతిగా నీరు తాగితే కిడ్నీలకు ప్రమాదమా..

ABN, Publish Date - Sep 20 , 2025 | 10:24 PM

కొందరు రోజుకు 6 గ్లాసుల నీళ్లు తాగాలంటారు. మరికొందరు ఎనిమిది గ్లాసులు అంటారు. అసలు నీరు ఎక్కువగా తాగితే కిడ్నీలకు ప్రమాదమా అన్న సందేహం మీకెప్పుడైనా కలిగిందా? దీనికి వైద్యులు సవివరమైన సమాధానమే ఇస్తున్నారు

1/8

ఒంట్లో అతిగా నీరు పెరగడాన్ని ఓవర్‌హైడ్రేషన్ అంటారు. డీహైడ్రేషన్ వలెనే ఇది కూడా కిడ్నీలకు చేటు చేస్తుంది.

2/8

కిడ్నీలు కేవలం మలినాలను తొలగించడమే కాకుండా ఒంట్లో నీరు, మినరల్స్ మధ్య సమతౌల్యాన్ని కాపాడతాయి.

3/8

అతిగా నీరు తాగితే సోడియం శాతం తగ్గుతుంది. దీన్ని హైపోనాట్రేమియా అంటారు. ఇది కిడ్నీలపై ఒత్తిడి పెంచుతుంది.

4/8

రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలన్నది కచ్చితమైన నిబంధన కాదని నిపుణులు చెబుతున్నారు. నీటి అవసరాలు ఆయా వ్యక్తుల శారీరక తత్వం, జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది.

5/8

అతిగా నీరు తాగితే మెదడులో వాపు వచ్చి కన్ఫ్యూజన్ వంటివి వస్తాయి. ఒక్కోసారి ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

6/8

అతిగా నీరు తాగే వారిలో కొందరికి కడుపుబ్బరం, నీరసం వంటి వస్తుంటాయి.

7/8

కిడ్నీ, గుండె, హార్మోన్ సమౌతౌల్యానికి సంబంధించిన సమస్యలు ఉన్న వారు అతిగా నీరు తాగితే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది.

8/8

కేవలం నీరు తాగకుండా ఎలక్ట్రోలైట్స్ ఉన్న డ్రింక్స్ లేదా నీరు అధికంగా ఉండే పండ్లను తినాలని నిపుణులు చెబుతున్నారు.-

Updated Date - Sep 20 , 2025 | 10:24 PM